Russia Ukraine War: ఇంకా సీరియస్ అయిన రష్యా: కీవ్ నగరాన్ని బూడిద చేయడమే లక్ష్యంగా అడుగులు
యుక్రెయిన్ పై యుద్ధంలో రష్యా మరింత సీరియస్ అయింది. ఇప్పటివరకు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క అన్నట్లుగా భారీ విధ్వంసానికి తెరలేపింది రష్యా.

Russia
Russia Ukraine War: యుక్రెయిన్ పై యుద్ధంలో రష్యా మరింత సీరియస్ అయింది. ఇప్పటివరకు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క అన్నట్లుగా భారీ విధ్వంసానికి తెరలేపింది రష్యా. కీవ్ నగరాన్ని బూడిద చేయడమే లక్ష్యంగా రష్యా వేస్తున్న అడుగులు.. ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయోనని భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం సాయంత్రానికి.. కీవ్ వెలుపల.. 65 కిలోమీటర్ల పొడవునా శతాగ్నిదళాలను మోహరించిన రష్యా.. క్షణాల వ్యవధిలో కీవ్ ను భస్మీపటలం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇక యుక్రెయిన్ లోని కీవ్ నగరంలో ఉన్న ప్రజలందరూ నగరాన్ని వదిలెళ్ళలంటూ రెండు రోజుల క్రితమే రష్యా సైన్యం హెచ్చరించగా.. అక్కడి ప్రజలు కదల్లేదు. దీంతో సోమవారం నాడు కాల్పులకు కాస్త విరామం ఇచ్చిన రష్యా సైనికులు.. ప్రజలను మరోసారి హెచ్చరించారు. ఇంతలో యుక్రెయిన్ లోని మరో అతిపెద్ద నగరం ఖార్కివ్ ను రష్యా సైన్యం హస్తగతం చేస్తుంది.
Also read: Russia-Ukraine War: కీవ్ నగరాన్ని అత్యవసరంగా ఖాళీ చేయాలని ఆదేశాలు.. ఏం జరగబోతోంది?
మంగళవారం ఉందయం నుంచి ఖార్కివ్ లో రష్యా సైనికులు దాడులకు పాల్పడ్డారు. భవనాలను, వంతెనలను, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను కూల్చివేశారు. సైనిక స్థావరాలతో పాటు జనావాసాలపైనా రష్యా సైనికులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల నుంచి రక్షణ పొందేందుకు భవనంలో తలదాచుకున్న 70 మంది యుక్రెయిన్ పౌరులు మృతి చెందినట్లు యుక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ఖార్కివ్ నగరంపై రష్యా సైనికులు బాంబుల వర్షం కురిపించిన తీరు అత్యంత భయానకంగా ఉన్నట్లు అక్కడి కొందరు ప్రత్యక్ష సాక్షులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మరో వైపు మంగళవారం మధ్యాహ్నం లేదా బుధవారం తెల్లవారు నుంచి కీవ్ నగరంలోనూ బాంబుల వర్షం కురిపించేలా రష్యా సిద్ధమైందని తెలుస్తుంది. ఖార్కివ్ కంటే ఎక్కువగా కీవ్ నగరంపై దాడులు చేసేందుకు రష్యా సైనికులు సిద్ధమయ్యారు.
Also read: Ukraine Russia War : యుక్రెయిన్‌పై వెనక్కి తగ్గని పుతిన్.. ఆ ధైర్యం ఇచ్చింది ఇతడేనట..!
దీంతో కీవ్ నగరంలో ఉన్న భారత పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన భారత అధికారులు.. నగరంలో వారు ఏ మూలన ఉన్నా.. క్షణాల వ్యవధిలో నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. కీవ్ నగరం నుంచి పోలాండ్ సరిహద్దు దగ్గరగా ఉంటుంది. అక్కడి చేరుకునేలా వెంటనే ప్రయాణం ప్రారంభించాలని భారత అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిస్థితులను గమనించిన మీదట.. కీవ్ నగరంలో రష్యా అణుబాంబు దాడికి పాల్పడనుందనే వార్తలు పుట్టుకొచ్చాయి. అందుకు బలం చేకూర్చుతూ సోమవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ కీవ్ నగరాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో ఇప్పుడు రష్యా – యుక్రెయిన్ మధ్య యుద్ధం ఎటు దారి తీస్తుందోనన్న భయం ప్రపంచ దేశాల్లో ఒణుకు పుట్టిస్తుంది.
Also read: Russia Ukraine Conflict : ఆగని రష్యా-యుక్రెయిన్ యుద్ధం.. 352 మంది మృతి.. 14 మంది చిన్నారులే..!