Sputnik-V Effective Against Omicron : ఒమిక్రాన్ పై ప్రభావవంతంగా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్!
: ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఒకే ఒక్క పేరు "ఒమిక్రాన్". కొద్ది రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో తొలిసారిగా వెలుగుచూసినట్లుగా చెప్పబడుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"

Omicron (9)
Sputnik-V Effective Against Omicron : ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఒకే ఒక్క పేరు “ఒమిక్రాన్”. కొద్ది రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో తొలిసారిగా వెలుగుచూసినట్లుగా చెప్పబడుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”వ్యాప్తి చాలా ఫాస్ట్ గా ఉంది. కొద్ది రోజుల్లోనే 91 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మన దేశంలోనూ ఈ వేరియంట్ కేసుల సంఖ్య సెంచరీ మార్కు దాటేసింది.
అయితే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రస్తుత టీకాలు ఉత్పన్నం చేసే రోగనిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా, ఇంకొందరు కొన్ని టీకాలు కొత్త వేరియంట్‌పై పని చేస్తాయని పేర్కొంటున్నారు. అయితే ఈ వేరియంట్ పూర్తి స్వభావం ఎలా ఉంటుంది?ప్రస్తుత కోవిడ్ వ్యాక్సిన్లు ఈ వేరియంట్ పై ఎంతమేర ప్రభావవంతంగా పనిచేస్తాయన్నదానిపై పరిశోధనలు జరుగుతున్న వేళ ప్రపంచంలోనే తొలిసారిగా కోవిడ్ వ్యాక్సిన్ “స్పుత్నిక్ వీ” ను అందుబాటులోకి తీసుకొచ్చిన రష్యా ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది.
స్పుత్నిక్-వి వ్యాక్సిన్ “ఒమిక్రాన్”ను ప్రభావవంతంగా ఎదుర్కోగలదని రష్యా ప్రకటించింది. రష్యా ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఒమిక్రాన్ వేరియంట్‌పై మూడు నుంచి ఏడు రెట్లు మెరుగ్గా పనిచేసింది. ఎంఆర్ఎన్ఏ సాంకేతికతను ఉపయోగించిన అభివృద్ధి చేసిన టీకాల కంటే కూడా ప్రభావవంతంగా పనిచేసింది. అదే సమయంలో బూస్టర్ డోసుగా స్పుత్నిక్ లైట్ కూడా మెరుగ్గా పని చేస్తున్నదని వివరించింది.
స్పుత్నిక్ వీ లైట్ వెర్షన్ టీకా 80 ఎఫికసీని ప్రదర్శించినట్టు తెలిపింది. బూస్టర్ డోసుగా స్పుత్నిక్ లైట్‌ను మళ్లీ వ్యాక్సినేట్ చేసిన 100 మందిలోనూ ఒమిక్రాన్ వేరియంట్ పూర్తిగా నాశనం అయిందని పేర్కొంది. బలమైన, దీర్ఘకాలం పని చేసే టీ సెల్స్ ప్రతిస్పందనను కలిగించే శక్తి స్పుత్నిక్ వీ టీకాకు ఉందని పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్‌లోని ఉత్పరివర్తనాలు టీ సెల్స్‌లోని 80 శాతం ఎపిటోప్స్‌ను ఏమీ చేయలేకపోయాయని తెలిపింది. స్పుత్నిక్ లైట్‌తో పోల్చితే ఫైజర్ టీకా 25 శాతం మాత్రమే ప్రభావాన్ని చూపెట్టిందని వివరించింది.
ALSO READ Punjab Election : కెప్టెన్ పార్టీతో బీజేపీ పొత్తు ఖరారు..విజయం 101శాతం తమదేనన్న అమరీందర్