రష్యా కరోనా వ్యాక్సిన్ సేఫ్.. ట్రయల్ టెస్టు రీజల్ట్ తేలిపోయింది… వైరస్ ఖతమే!

  • Published By: sreehari ,Published On : September 4, 2020 / 07:07 PM IST
రష్యా కరోనా వ్యాక్సిన్ సేఫ్.. ట్రయల్ టెస్టు రీజల్ట్ తేలిపోయింది… వైరస్ ఖతమే!

Updated On : September 4, 2020 / 7:31 PM IST

Russia’s COVID-19 Vaccine Safe : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. అన్ని దేశాలు కంటే ముందుగానే రష్యా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ లో ముందంజలో నిలిచింది. ప్రపంచంలో మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిచేసిన దేశంగా రష్యా గొప్పగా చెప్పుకొంటోంది.. అయితే.. రష్యా ట్రయల్స్ పూర్తి స్థాయిలో కాకుండానే కరోనా వ్యాక్సిన్ విడుదల చేస్తోందంటూ ప్రపంచ దేశాల నుంచి పలువురు నిపుణులు విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. రష్యా వ్యాక్సిన్ తొలి వ్యాక్సిన్ లో భయానక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఇంతలోనే రష్యా రెండో వ్యాక్సిన్ దిశగా ప్రయత్నాలు చేపట్టింది..



కరోనా వ్యాక్సిన్ తామే ముందు అందించామనే తొందరగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ అనేక దేశాలు తప్పుబట్టాయి.. వీటిన్నింటికి రష్యా దిమ్మతిరిగేలా సమాధానమిచ్చింది.. రష్యా కరోనా వ్యాక్సిన్ సురక్షితమంటూ ఇటీవలి ట్రయల్స్ టెస్టులో తేలింది.. లాన్సెట్ అధ్యయనంలో కూడా ఇదే వెల్లడించింది. రష్యా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పేషెంట్లలో చాలామందిలో యాంటీ బాడీస్ తయారయ్యాయని గుర్తించారు.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్ధారించారు. ఈ పరిశోధనకు సంబంధించి లాన్సెట్ అధ్యయనాన్ని ప్రచురించింది.. కానీ, నిపుణులు మాత్రం వ్యాక్సిన్ సురక్షితం, ప్రభావాన్ని నిరూపించడానికి ఈ ట్రయల్స్ సరిపోవని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి విమర్శలను మాస్కో పరిశోధనను అణగదొక్కే ప్రయత్నంగా రష్యా తీవ్రంగా ఖండించింది.



లాన్సెట్ అధ్యయనంలో.. రెండు చిన్న ట్రయల్స్‌పై రష్యన్ పరిశోధకులు పరీక్షించారు. అందులో ఒక్కొక్కటి 18ఏళ్ల నుంచి 60ఏళ్ల మధ్య వయస్సు గల 38 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లు పాల్గొన్నారు.. వారికి రెండు రకాలుగా రోగనిరోధకత ఇచ్చారు. ట్రయల్స్‌లో పాల్గొనేవారికి టీకా మొదటి భాగంలో ఒక మోతాదు ఇచ్చారు. ఆ తరువాత 21 రోజుల తరువాత రెండవ భాగంతో మరో మోతాదు ఇచ్చారు. అలా 42 రోజులలో వారిని పర్యవేక్షించారు. మొదటి మూడు వారాల్లోనే వారిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్టు గుర్తించారు. దీంతో వ్యాక్సిన్ సురక్షితమైనదిగా తేల్చారు..



అంతేకాదు.. వైరస్‌ను బాగా తట్టుకోగలదని నిరూపించారు. ఆరోగ్యకరమైన వాలంటీర్లలో తీవ్రమైన దుష్ప్రభావాలకు కారణం కాదని డేటా చూపించిందని నివేదిక తెలిపింది. ఈ ట్రయల్స్‌లో పాల్గొన్న 76 మందిని 180 రోజుల వరకు పర్యవేక్షిస్తామని నివేదిక పేర్కొంది. కోవిడ్ -19 వ్యాక్సిన్లతో భద్రత చూపించడం చాలా కీలకం.. టీకా అనుమతి మాత్రమే కాదు, టీకాలపై విస్తృతంగా నమ్మకం ఉండాలని సూచిస్తున్నాయి. మరోవైపు… ప్రపంచ ఆరోగ్య సంస్థ రష్యాను ఏర్పాటు చేసిన మార్గదర్శకాలను పాటించాలని సురక్షితమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధికి అవసరమైన మార్గాల్లో ప్రయత్నించాలని సూచించింది.