స్టేడియం సైజున్న ఆస్టరాయిడ్.. ఈ రాత్రికే భూమికి దగ్గరగా దూసుకుస్తోంది!

2020 ఏడాది ప్రపంచానికి కష్ట కాలంగా మారింది. కరోనాతో అల్లాడిపోతున్న ప్రపంచానికి మరో ముప్పు ఆస్టరాయిడ్ రూపంలో రాబోతోందనే భయాందోళన నెలకొంది. స్టేడియం అంత పరిమాణం ఉన్న ఓ అతిపెద్ద అంతరిక్ష ఉల్క (ఆస్టరాయిడ్) భూమికి దగ్గరగా దూసుకోస్తోంది. అది కూడా ఈ రాత్రికే భూమికి సమీపంగా వస్తుందని చెబుతున్నారు ఖగోళశాస్త్రజ్ఞులు. కానీ, దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
టెలిస్కోపుల ద్వారా ఆస్ట్రరాయిడ్ గమనాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడూ పరిశీలిస్తున్నారు. 2002 NN4 అనే ఉల్క.. భూమికి దగ్గరగా వస్తోందని, కానీ అదృష్టవశాత్తూ.. భూమిని తాకదని అంటున్నారు. భూమి, చంద్రుడికి మధ్య 13.25 సార్లు సమాన దూరంలో పయనిస్తుందని చెబుతున్నారు. అంటే.. మన గ్రహం నుంచి 3.2 మిలియన్ల మైళ్లు (5.2 మిలియన్ కిలోమీటర్లు) దూరంలో ఉందనమాట. జూన్ 6 (రాత్రి 11.20) గంటల సమయంలో భూమికి దగ్గరగా ఆస్ట్రరాయిడ్ రాబోతున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆస్ట్రాయిడ్ 2002 NN4 పరిమాణం చాలా ఎక్కువగానే ఉందని అంటున్నారు. అంచనా ప్రకారం.. డయా మీటర్ 820 అడుగుల నమధ్య ఉంటుంది. 1,870 అడుగులు (250 మీటర్ల నుంచి 570 మీటర్లు) మధ్య ఉంటుంది. 2013లో రష్యాలోని Chelyabinsk వాతావరణంలోకి దూసుకొచ్చిన ఉల్క దాదాపు 66 అడుగులు (20 మీటర్లు) ఉల్క పరిమాణం కంటే డజన్ సార్లుకు పైగా ఉంటుంది. NASA, నెట్ వర్క్ పార్టనర్ టెలిస్కోపులతో ప్రతిరోజు భూమికి సమీప ఆస్ట్రాయిడ్ గమనాన్ని ఎప్పటికప్పుడూ స్కాన్ చేస్తూనే ఉన్నారు. అదృష్టవశాత్తూ మన గ్రహానికి ఎలాంటి ముప్పు లేదని నాసా వెల్లడించింది.
Read: ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్‌కు అన్ని పెట్రోల్ స్టేషన్లు అవసరమే!