Taliban : అమ్రుల్లా సలేహ్‌ ఇంట్లో తాలిబన్ల సోదాలు.. 45కోట్ల నగదు, 15 గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం

అప్ఘానిస్తాన్‌లో అక్రమ ఆస్తులపై తాలిబన్ల కన్నుపడింది. మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ఇంట్లో తాలిబన్లు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Taliban : అమ్రుల్లా సలేహ్‌ ఇంట్లో తాలిబన్ల సోదాలు.. 45కోట్ల నగదు, 15 గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం

Taliban Seize Usd 6 Million In Cash, 15 Gold Bricks From Ex Vice President Amrullah Saleh's House

Updated On : September 14, 2021 / 12:45 PM IST

Amrullah Saleh house : అప్ఘానిస్తాన్‌లో అక్రమ ఆస్తులపై తాలిబన్ల కన్నుపడింది. దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ఇంట్లో తాలిబన్లు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. సలేహ్ ఇంట్లో దాదాపు 45 కోట్ల నగదు, 15 బంగారు బిస్కెట్లను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.

అప్ఘాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ దేశం విడిచి పారిపోయిన తర్వాత సలేహ్‌ దేశ కొత్త అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. అప్ఘాన్ తాలిబన్ల ఆక్రమణతో సలేహ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తాలిబన్లు అమ్రుల్లా ఇంట్లో సోదాలు నిర్వహించారు. సుమారు 6 మిలియన్ల డాలర్లు భారత కరెన్సీలో రూ. 45 కోట్ల నగదు, 15 వరకు బంగారు బిస్కెట్లను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నట్టు తాలిబన్‌ మల్టీమీడియా బ్రాంచ్‌ చీఫ్‌ అహ్మదుల్లా ముట్టాఖీ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.
Rohullah Saleh : అప్ఘాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడు అమ్రుల్లా సోదరుడిని హింసించి కాల్చిచంపిన తాలిబన్లు

తాలిబన్ల సోదాలకు సంబంధించి వీడియోను కూడా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. సలేహ్‌ సహా ఆయనతో కలిసి పనిచేసిన మంత్రులు, అధికారులు, అవినీతికి పాల్పడినవారి ఇళ్లలోనూ తాలిబన్ల సోదాలు జరుపుతున్నారు. ఈ సోదాల్లో తాలిబన్లకు భారీ మొత్తంలో నగదు లభించినట్టు తెలుస్తోంది. దేశం విడిచి పారిపోయిన జాబితాను తీసుకుని సోదాలు జరుపుతున్నారు.

ప్రతిఘటన దళాల నేత అహ్మద్‌ మస్సౌద్‌తో కలిసి పోరాటం అమ్రుల్లా కొనసాగించాడు. ఈ క్రమంలో సలేమ్‌ సోదరుడు రుల్లాహ్‌ను తాలిబన్లు బంధించారు.. అతన్ని చిత్రహింసలు పెట్టి కాల్చిచంపేశారు తాలిబన్లు. సెప్టెంబర్‌ 6న పంజ్‌షీర్‌ తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అప్పటినుంచి అమ్రుల్లా కనిపించకుండా పోయారు. ఇంతకీ ఆయన ప్రాణాలతోనే ఉన్నాడా? లేదా పరారీలో ఉన్నాడో లేదో స్పష్టత లేదు.
Afghanistan : తాలిబ‌న్ క‌మాండ‌ర్స్‌ పిలుపు.. డ్యూటీలోకి అఫ్గాన్ పోలీసులు