స్టూడెంట్ తల్లికి కిడ్నీ డొనేట్ చేసిన టీచర్.. ఇప్పుడు ఇద్దరూ మరో కిడ్నీ కావాలని అడుగుతున్నారు

మిస్సౌరీ ఆర్ట్ టీచర్ మిస్త్రీ బిర్డ్ తన స్టూడెంట్స్ లో ఒకరి తల్లికి కిడ్నీ అవసరం ఉందని తెలిసి ఆలోచన లేకుండా ఫోన్ చేసి తానిస్తానని చెప్పేశారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ అయింది. కానీ, ఇప్పుడు ఇద్దరికీ మరో కిడ్నీ కావాలంటూ వేరొక వ్యక్తిని అడుగుతున్నారు. అసలేమై ఉంటుంది..
మాన్స్‌ఫీల్డ్‌లోని వైల్డర్ ఎలిమెంటరీలో ఎనిమిదో సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటున్న బిర్డీ (41) ఫిప్త్ గ్రేడర్ వారికి క్లాసులు చెప్తుంటారు. అతనికి ఖాళీ దొరికినప్పుడల్లా స్టూడెంట్స్ కు, క్లాస్ రూంకు సహాయం కావాలంటే చేస్తుంటాడు. ఈ టీచర్ కు స్టూడెంట్ ఫిషర్ క్రానీ తల్లి షానోన్ క్రానీ అంటే బయట కాస్త పరిచయం ఉంది.
https://10tv.in/maruti-suzuki-launches-car-subscription-program-in-pune-hyderabad/
ఆమెకు కాస్త అనారోగ్యంగా ఉందని.. తెలిసింది. కానీ, ఫేస్‌బుక్ లో చూసేంత వరకూ సమస్య ఏంటో స్పష్టత లేదు. కిడ్నీ కావాలని తెలిసి తాను డొనేట్ చేస్తానంటూ ముందుకొచ్చాడు. ‘తనది ఓ నెగెటివ్.. నేనూ ఓ నెగెటివ్. నాకు నిజంగా దీని గురించి మరోసారి ఆలోచించాలి అనిపించలేదు. నేను ఆమె కిడ్నీ కోఆర్డినేటర్ ను కాంటాక్ట్ అయి అక్కడికి వెళ్లాను’ అని బిర్డ్ అంటున్నారు.
క్రానీ(43) తన కిడ్నీలు 20శాతం మాత్రమే పనిచేస్తున్నాయని తెలిశాక జనవరి 2019లో ఓ సారి రొటీన్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. అప్పుడు ఆమె ఐదో స్టేజ్ రెనాల్ ఫెయిల్యూర్ వద్ద ఉంది. బయోప్సీ, స్ట్రింగ్ టెస్టులు పూర్తి అయ్యాక కిడ్నీ ఫెయిల్యూర్ కు కారణాలేంటో డాక్టర్ చెప్పలేకపోయారు. అప్పటి నుంచి ఆమెకు డయాలసిస్ జరుగుతూ వస్తుంది.
మార్చి నెలలో బిర్డ్ కిడ్నీ మ్యాచ్ అవుతుందని తెలిసింది. వారిద్దరి మధ్య సంబంధాలు లేకపోయినా అలా సెట్ అవడాన్ని డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ సమయంలో కరోనావైరస్ ఆ ప్రాంతానికి కూడా పాకింది. దీంతో మరిన్ని టెస్టులు చేశారు. జూన్ నెలలో సర్జరీ చేయొచ్చని డిక్లేర్ చేశారు.
ఇప్పడు తాను బెటర్ గా ఫీలవుతున్నానని.. మిగిలిన కిడ్నీ వల్ల మాత్రమే సమస్యగా ఉందని చెప్పింది. ఇప్పుడు వారి కమ్యూనిటీలోనే వేరొక వ్యక్తికి కిడ్నీ అవసరం అయింది. ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన జాసన్ ఈగల్ స్టన్ రెనాల్ జబ్బు చివరి దశలో రెండేళ్లుగా బాధపడుతున్నాడు. టైప్ ఓ నెగెటివ్ అయినా పాజిటివ్ అయినా ముందుకురావాలంటూ ఫేస్ బుక్ ద్వారా వేడుకుంటున్నాడు.
వారిలా మరొకరు లబ్ధి పొందాలని, అవయవ దానం చేసేందుకు ముందుకు రావాలని వారిద్దరూ చెప్తున్నారు. మీరు చేసే పని ఒకరి ప్రాణం కాపాడినట్లు అవుతుందని చెప్తున్నారు. ఇదొక అద్భుతమైన బహుమతని చెప్తున్నారు.