United States : ఆ స్పైసీ చిప్స్ తిన్నాడు.. కొన్ని గంటల్లోనే…
టిక్ టాక్ 'స్పైసీ చిప్ ఛాలెంజ్' 14 ఏళ్ల బాలుడిని పొట్టన పెట్టుకుంది. ఛాలెంజ్‌లో భాగంగా స్పైసీ చిరుతిండి తినడంతో విపరీతమైన కడుపునొప్పితో అతను చనిపోయాడు.

United States
United States : ఈ మధ్యకాలంలో కొన్ని విపరీతమైన ఛాలెంజ్‌లు ప్రాణాలు హరిస్తున్నాయి. తాజాగా యుఎస్‌లో టిక్ టాక్ ‘స్పైసీ చిప్ ఛాలెంజ్’ ఓ బాలుడిని పొట్టన పెట్టుకుంది.
Girl Challenge Viral : తుమ్మినపుడు కళ్లు మూయనని ఛాలెంజ్ చేసింది.. ఆ తరువాత ఏమైందంటే?
మసాచుసెట్స్‌కు చెందిన హారిస్ వోలోబాగా స్పైసీ చిరుతిండి కారణంగా చనిపోయినట్లు తెలుస్తోంది. వైరల్ టిక్ టాక్ ట్రెండ్‌ను ప్రయత్నించిన ఈ బాలుడు కొన్ని గంటల్లోనే చనిపోయాడు. ‘వన్ చిప్ ఛాలెంజ్’ లో అత్యంత స్పైసీ టోర్టిల్లా చిప్‌లను తినాల్సి ఉంటుంది. ఛాలెంజ్‌లో పాల్గొన్న తరువాత కొంత సమయం పాటు ఆ మంటను భరించాల్సి ఉంటుంది. ఈ చిప్స్‌ను ప్రపంచంలోని హాటెస్ట్ మిరపకాయలు – కరోలినా రీపర్, స్కార్పియన్ నుండి తయారు చేయబడతాయట. ఇది తిన్నతరువాత అతనికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చిందట. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే మరణ నిర్ధారణ కోసం పోస్టుమార్టంకి తరలించారు.
Pakistan: దమ్ముంటే ఆ సింగర్‌ని విమర్శించండి చూద్దాం.. నెటిజెన్లకు ఛాలెంజ్ విసిరిన పాక్ సింగర్
హారిస్ వోలోబా మరణంపై అతను చదువుకుంటున్న హారిస్ పాఠశాల నివాళులర్పించింది. బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా అయిన అతనిని కోల్పోవడం బాధను కలిగించిందని స్కూల్ యాజమాన్యం పేర్కొంది.