Hong Kong Cricket Team: ‘కాలా చష్మా’ సాంగ్‌కు సూపర్ డ్యాన్స్ చేసిన హాంకాంగ్ జట్టు సభ్యులు.. వీడియో వైరల్.. వారి సంతోషానికి కారణమేమంటే..

ఆసియా కప్‌ టోర్నీలో అర్హత సాధించిన హాంకాంగ్ జట్టు సభ్యులు డ్యాన్స్ తో దుమ్మురేపారు. కాలా చష్మా సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Hong Kong Cricket Team: ‘కాలా చష్మా’ సాంగ్‌కు సూపర్ డ్యాన్స్ చేసిన హాంకాంగ్ జట్టు సభ్యులు.. వీడియో వైరల్.. వారి సంతోషానికి కారణమేమంటే..

Hong kong cricket team

Updated On : August 27, 2022 / 11:35 AM IST

Hong Kong cricket team: నేటి నుంచి ఆసియా కప్- 2022 టీ20 టోర్నీ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు శ్రీలంక, ఆప్గానిస్థాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గోంటుండగా 13 మ్యాచ్ లు జరగనున్నాయి. గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్థాన్ జట్లు తొలుత ఎంపిక కాగా క్వాలీఫై మ్యాచ్ ఆడి హాంకాంగ్ జట్టు అర్హత సాధించింది.

Hong Kong: ఆసియా కప్‌‌కు క్వాలిఫై అయిన హాంకాంగ్.. గ్రూప్ – Aలో భారత్, పాక్‌తో ఢీ

ఈవారం ప్రారంభంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో హాంకాంగ్ జట్టు గెలుపొందింది. దీంతో ఆసియా కప్ 2022కి అర్హత సాధించింది. గ్రూప్ -ఏలో భాగంగా ఆగస్టు 31న భారత్‌తోనూ, సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో ఈ జట్టు తలపడనుంది.

 

View this post on Instagram

 

A post shared by Ali 3 (@alizeeshan908)


అయితే ఆసియా కప్ కు అర్హత సాధించిన తరువాత హాంకాంగ్ టీం ఆటగాళ్లు సందడి చేశారు. బార్ బార్ దేఖో సినిమాలోని ‘కాలా చష్మా’ పాటకు రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. వికెట్ కీపర్ జీషన్ అలీ ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.