White House : కమలా హారిస్ అధికారిక పొట్రెయిట్ ఫొటో.. ట్రెండింగ్

White House : కమలా హారిస్ అధికారిక పొట్రెయిట్ ఫొటో.. ట్రెండింగ్

The White House Releases Official Kamala Harris Portrait (1)

Updated On : April 11, 2021 / 2:21 PM IST

Official Kamala Harris Portrait : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హరిస్ అధికారిక పొట్రెయిట్ ఫొటోలు రెండింటిని వైట్ హౌస్ రిలీజ్ చేసింది. అందులో కమలా హరిస్ అధికారిక పొట్రెయిట్ ఫొటో అందరిని ఆకట్టుకుంటోంది.

వైస్ ప్రెసిడెంట్ కు చీఫ్ ఫొటోగ్రాఫర్ అయిన లారెన్స్ జాక్సన్ ఈ ఫొటోను క్యాప్చర్ చేశారు. తన అఫీషియల్ పొట్రెయిట్ ఫొటోను చూసి ఆనందపడిన హరిస్.. తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశారు.

పొట్రెయిట్ ఫొటోలో హరిస్.. సిగ్నేచర్ పెరల్స్, ఈ ఫొటోకు 2లక్షల లైకులు, 11వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. నేవీ బ్లజర్ ధరించి ఉన్నారు. మార్చి 4న ఈ ఫొటోను జాక్సన్ తన కెమెరాలో క్లిక్ మనిపించారు.


ఒబామా ప్రభుత్వ హయాంలో బైడెన్-హరిస్ ప్రచార కార్యక్రమాలకు స్టాఫ్ ఫొటోగ్రాఫర్ గా జాక్సన్ పనిచేశారు. వైట్ హౌస్ లోని లైబ్రరీ రూంలో మార్చి 3,2021న బైడెన్ అధికారిక పొట్రెయిట్ ఫొటోను ఆవిష్కరించడంపై అదమ్ ష్కెల్జ్ సంతోషం వ్యక్తం చేశారు.


బైడెన్, కమలా హరిస్ పొట్రెయిట్ ఫొటోలను చూసిన వారంతా ఇతరులకు షేర్లు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Lawrence Jackson (@jackimages)