ఇటలీ వృధ్ధుల త్యాగానికి వెల కట్టలేము

  • Published By: chvmurthy ,Published On : April 4, 2020 / 09:53 AM IST
ఇటలీ వృధ్ధుల త్యాగానికి వెల కట్టలేము

Updated On : April 4, 2020 / 9:53 AM IST

కరోనా వైరస్ మహమ్మారి  బారిన పడిన వారిని రక్షించేందుకు డాక్టర్లు, నర్సులు చేస్తున్న సేవ అమోఘమైంది.  వైరస్ పుట్టిన చైనా కంటే ఇటలీ దేశంలో మరణాలు ఎక్కువ సంభవించాయి. కానీ అక్కడ సరైన వైద్య సౌకర్యాలు లేక  అనేక మంది మృత్యు ఒడిలోకి ఒరిగిపోయారు. కరోనా పాజిటివ్  వచ్చిన వారిలో కొందరు  నేడు హీరోలుగా మిగిలి పోయారు. 

దేశంలో నానాటికీ  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ  వారికి సరిపడినన్నీ ఐసీయూ లు లేక, వెంటిలేటర్లు లేక  రోగులు ఇబ్బందులు పడ్డారు. డాక్టర్లు, నర్సులు ప్రాణాలకు తెగించి వారికి సేవలు అందిస్తున్నారు.  వీరిని చూసి మేము సైతం అంటూ ముందుకు వచ్చారు ఆ హీరోలు.

 కరోనా  పాజిటివ్ వచ్చి ఆస్పత్రిలో చేరిన కొందరు వృధ్దులు తాము ఐసీయూలో ఉండటానికి ఇష్టపడలేదు. వెంటిలేటర్లు వాడటాన్ని తిరస్కరించారు.వాటిని చిన్నవారికి యుక్తవయస్సులో ఉన్నవారికి ఇచ్చి వారి ప్రాణాలను కాపాడమని డాక్టర్లను కోరారు. 

బెల్జియంలో ఇటీవల మరణించిన సుజాన్ హోయ్లెర్ట్స్ అనే 90 ఏళ్ల మహిళ మార్చి20న కరోనా బారిన  వైరస్ సోకి ఆస్పత్రిలో చేరింది.  పరీక్షల అనంతరం ఆమెకు పాజిటివ్ అని తేలింది. డాక్టర్లు ఆమెకు వైద్యం చేయటం ప్రారంభించారు. కానీ ఆమె ఐసీయూలో ఉండి, వెంటిలేటర్లు ఉపయోగించటానికి  ఒప్పుకోలేదు.  ఇప్పటికే తాను ఎంతో జీవితాన్ని చూశానని…. తనకు ఉపయోగించదలచిన వెంటిలేటర్లను తనకు బదులుగా చిన్నారులకు అమర్చి వారి ప్రాణాలను కాపాడమని కోరింది. 

వైద్యులు ఆమె కోరిక మేరకు ఆ పరికరాలను మరోక చిన్నారికి అమర్చి మరోక ప్రాణం కాపాడారు. మా అమ్మ అంత్యక్రియలకు కూడా నేను హాజరు కాలేను. కానీ మా అమ్మకు అమర్చే వెంటిలేటర్ సాయంతో మరోక ప్రాణం నిలబడిందని సుజాన్ హోయ్లెర్ట్స్ కుమార్తె  పేర్కోంది. 

ఇటలీలోని లవెర్లోని ఒక ఆసుపత్రిలో COVID-19  వైరస్ సోకి మరణించిన 72 ఏళ్ల మతబోధకుడు డాన్ గియుసేప్ బెరార్డెల్లి కూడా వెంటిలేటర్ల ఉపయోగించటానికి నిరాకరించాడు. తన కోసం కొనుగోలు చేసిన వెంటిలేటర్లను చిన్నవయస్సులో ఉన్న  మరోక రోగికి అమర్చమని త్యాగం చేశాడు.  

మార్చి 15 న మరణించిన బెరార్డెల్లి కూడా  వార్తల్లో నిలిచాడు. అతను చేసిన త్యాగానికి….ఖననం చేసేటప్పుడు,  స్ధానికులు తమ ఇంటి బాల్కనీల్లో నిలబడి శ్రధ్దాంజలి ఘటించారు. 

ప్రపంచ వ్యాప్తంగా COVID-19  బారిన పడిన వారిలో వృధ్ధులే ఎక్కువగా ఉన్నారు. ఈవాస్తవాన్ని గ్రహించి  కొందరు వృధ్ధులు తమకు  ఉపయోగించే వైద్య సౌకర్యాలను… వైరస్ సోకిన యువతకు ఉపయోగించమని కోరి హీరోలుగా మారారు. (ఆ హాస్పిటల్‌లోని డాక్టర్లు,నర్సులతోసహా 108మంది క్వారంటైన్‌కి...)