మూడు నెలల నుంచి రెండేళ్లు: కరోనా వ్యాక్సిన్ వల్ల వచ్చే ఇమ్యూనిటీ ఎంతకాలం?

Corona-Vaccine-immunity
Vaccine Immunity: కరోనా వ్యాక్సిన్.. 2020లో వచ్చిన మహమ్మారి. సంవత్సరమంతా వెన్నులో వణుకుపుట్టించి అతలాకుతలం చేసింది. ఎలా అయితే వ్యాక్సిన్ రెడీ చేసి SARS CoV-2 అంతమొందించే ఏర్పాట్లు చేశారు.
సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన కూడా ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ ఆథరైజేషన్ కొట్టేసింది. మరి ఇప్పుడు మరో వ్యాక్సిన్ వచ్చి కరోనావైరస్ తో పోరాడేందుకు ఇమ్యూనిటీ ఇస్తానంటోంది. అసలు ఏ వ్యాక్సిన్ ఎంత వరకూ ఇమ్యూనిటీని ఇవ్వగలవు.
Moderna vaccine immunity
నోవల్ కరోనా వైరస్ తో పోరాడేందుకు రెడీ అయిన వ్యాక్సిన్ మోడర్నా ఎమ్ఆర్ఎన్ఏ. సీఈఓ స్టీఫెన్ బన్సెల్ గురువారం చెప్పిన స్టేట్‌మెంట్ ప్రకారం.. ‘శరీరంలో ఉండే యాంటీబాడీలు వ్యాక్సిన్ వల్ల నిదానంగా తగ్గుతాయి. దీని వల్ల దాదాపు రెండేళ్ల వరకూ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఉంటుంది’
Covishield vaccine immunity
ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను సీరం ఇన్ స్టిట్యూట్ ఆప్ ఇండియా (కోవీషీల్డ్) రీసెంట్ గా ఇండియాలో ఎమర్జెన్సీ చేసుకోవచ్చని అప్రూవల్ దక్కించుకుంది. ఈ వ్యాక్సిన్ కు సహజంగానే ఎక్కువ ఇమ్యూనిటీ ఉండేలా కనిపిస్తుందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సీటీ ప్రొఫెసర్ సారా గిల్బెర్ట్ అంటున్నారు.
Pfizer-BioNTech vaccine immunity
అప్రూవ్ పొందిన కరోనావైరస్ వ్యాక్సిన్ లలో ఫైజర్-బయోఎన్టెక్ మొదటిది. యూకే, యూఎస్ లలో 85రోజుల ట్రయల్ తర్వాత ఇంకా SARS CoV-2 నుంచి సహజమైన ప్రొటెక్షన్ దొరుకుతుందని తేలింది.
Covaxin vaccine immunity
భారత్ బయోటెక్ కు చెందిన కొవాగ్జిన్ రీసెంట్ గా ఇండియాలో ఆథరైజేషన్ దక్కించుకుంది. కాకపోతే ట్రయల్స్ లో చాలా కాంట్రవర్సీ అయింది. ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చే యాంటీబాడీలు దాదాపు 6నుంచి 12 నెలల వరకూ సజీవంగా ఉంటాయి.
Johnson & Johnson vaccine immunity
ఫార్మాసూటిక్ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ ఇప్పటికీ కాంపిటీషన్ లోనే ఉంది. వ్యాక్సిన్ స్టడీలో ఫేజ్ 1, ఫేజ్ 2లు పూర్తించేసుకుంది. మొదటి డోస్ తర్వాత 29రోజుల పాటు యాంటీబాడీలు ఉంటాయని తెలియగా, రెండో డోస్ 98 శాతం పార్టిసిపెంట్స్ లో సక్సెస్ అయింది. మూడో దశ హ్యూమన్ ట్రయల్స్ చేయాల్సి ఉంది.
Sputnik V vaccine immunity
నోవల్ కరోనావైరస్ తో పోరాడేందుకు రెడీ అయిన తొలి వ్యాక్సిన్ స్పుత్నిక్. అన్ని ట్రయల్స్ పూర్తి చేసుకుని రష్యాలో మిలియన్లలో యూసేజ్ కు రెడీ అయింది. రీసెంట్ రిపోర్ట్ లో గమాలెయా ఇన్‌స్టిట్యూట్ హెడ్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రెండేళ్ల పాటు ఇమ్యూనిటీ ఇస్తుందని చెప్పారు. వ్యక్తి ఆరోగ్య స్థితిని బట్టి అంతకంటే ఎక్కువ ప్రొటెక్షన్ కూడా ఇవ్వొచ్చని అంటున్నారు.