సబర్మతీ ఆశ్రమంలోకి చెప్పులిప్పి వెళ్లిన ట్రంప్ జోడీ..

సబర్మతీ ఆశ్రమంలోకి చెప్పులిప్పి వెళ్లిన ట్రంప్ జోడీ..

Updated On : February 24, 2020 / 7:12 AM IST

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. దంపతులు సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 23కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆశ్రమానికి నిమిషాల్లో వ్యవధిల్లోనే చేరుకున్నారు ట్రంప్ దంపతులు. దారి పొడుగునా భారీ ర్యాలీతో ట్రంప్‌కు వెల్‌కమ్ చెప్పారు గుజరాత్ వాసులు. ఆశ్రమానికి చేరుకోగానే దంపతులిద్దరూ చెప్పులు విప్పి లోనికి ప్రవేశించారు. 

మహాత్ముడి ఫొటోకు మాల వేసి నమస్కరించుకున్నారు. ఆశ్రమం లోపల కలియదిరిగే సమయంలో మోడీ ఆయనకు అప్పటి పరిస్థితులను వివరించారు. అప్పట్లో రాట్నాన్ని వాడి నూలు వడికేందుకు ప్రయత్నించారు. చాలా కష్టపడి కూర్చున్నాడు ట్రంప్.. దంపతులిద్దరూ కలిసి మహాత్మా గాంధీ చట్రాన్ని తిప్పి నూలు వడికారు. ఆశ్రమవాసుల నుంచి నూలు వడకడం నేర్చుకున్నారు. ఫార్మాలిటీగా కాకుండా నిశితంగా పరిశీలించి స్వయంగా నూలు వడికారు. 

ఆశ్రమ సందర్శన అనంతరం అక్కడ ఉంచిన పుస్తకంలో ఆయన అభిప్రాయాన్ని రాశారు. సుదీర్ఘమైన వ్యాసంతో ఆయన సంతోషాన్ని వ్యక్తి చేశారు. ఆయనతో పాటుగా సతీమణి మెలనియా ట్రంప్ కూడా సంతకం చేసి విజిట్ చేసినట్లుగా వాళ్ల పేర్లు రాశారు. 

బయటికొచ్చే ముందు మూడు కోతుల్ని చూపించి.. ఆ ఫిలాసఫీని వివరించారు. ట్రంప్‌‍కు నచ్చడంతో ఎక్కువ సేపు అడిగి తెలుసుకోవడంతో పాటు క్లియర్ గా పరిశీలించారు. అక్కడి వరకూ ఒకే వాహనంలో ప్రయాణించి వచ్చిన మోడీ.. ట్రంప్ జోడీకి వీడ్కోలు చెప్పి మోటేరా స్టేడియంలో కలుస్తానని చెప్పి బయల్దేరారు.