Turkish Man: పోలీసులతో కలిసి తనను తానే వెతుక్కున్న వ్యక్తి

కుటుంబ సభ్యులో.. బంధువులో కనిపించలేదని వెదుకుతారు. కానీ, తానే కనిపించడం లేదని చెప్పి వెదుకులాట మొదలుపెట్టాడా వ్యక్తి. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.

Turkish Man: పోలీసులతో కలిసి తనను తానే వెతుక్కున్న వ్యక్తి

Self Searching

Turkish Man: కుటుంబ సభ్యులో.. బంధువులో కనిపించలేదని వెదుకుతారు. కానీ, తానే కనిపించడం లేదని చెప్పి వెదుకులాట మొదలుపెట్టాడా వ్యక్తి. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. టర్కీలో పోలీసులతో పాటు సెర్చింగ్ లో పాల్గొని అడవి మొత్తం తిప్పించాడు.

బెహాన్ ముట్లు(50) అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం ఫ్రెండ్స్‌తో పాటు ఇనెగల్ నగర సమీపంలోని శయ్యక గ్రామీణ ప్రాంతంలో పార్టీకి వెళ్లాడు. మద్యం మత్తులో పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి.. స్పృహ కోల్పోయాడు. అలా వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు మిస్సింగ్‌ కంప్లైంట్‌ నమోదు చేసి.. గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అతను తప్పిపోయిన అటవీ ప్రాంతానికి వెళ్లి పేరును పెద్దగా పిలుస్తూ సెర్చింగ్ కొనసాగించారు. స్పృహలో నుంచి కోలుకున్న బెహాన్‌కి రెస్పాండ్ అయ్యాడు. పూర్తిగా మత్తు వదలకపోవడంతో పోలీసులను సమీపించి తన గురించి తానే వెతకడం ప్రారంభించాడు.

………………………………… : ఆ ముద్దు సీన్లు ఎలా చేశామంటే..

అలా వెదుకుతుండగా పోలీసులు బెహాన్‌ పేరు పదేపదే పిలుస్తుండటంతో మత్తు వదిలిపోయింది. ఓ నిమిషం తర్వాత షాక్‌ నుంచి తేరుకున్నాడు. పోలీసులను ఎవరి గురించి వెతుకుతున్నారని ప్రశ్నించాడు. బెహాన్‌ అనే వ్యక్తి అడవిలో తప్పిపోయాడని అతని కోసమే గాలిస్తున్నామని చెప్పగా.. వెంటనే అది తానేనని చెప్పుకున్నాడు. అలా పోలీసులు బెహాన్‌ని అతడి ఇంటికి చేర్చారు.

పోలీసులతో పాటు కలిసి తనను తానే వెదుక్కున్న బెహాన్‌ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.