ఇద్దరు కేరళ నర్సులకు కరోనా పాజిటివ్!

  • Published By: veegamteam ,Published On : March 13, 2020 / 05:27 AM IST
ఇద్దరు కేరళ నర్సులకు కరోనా పాజిటివ్!

Updated On : March 13, 2020 / 5:27 AM IST

బహ్రెయిన్‌లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ నర్సులకు కరోనావైరస్(కొవిడ్-19) సోకింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లుగా అనుమానం వచ్చినవారు బ్లడ్ టెస్ట్ లు చేయించుకోగా..వారికి కరోనా సోకినట్లుగా పాజిటివ్ వచ్చింది. (భారత్ లో తొలి కరోనా మృతుడు…హైదరాబాద్‌లో ఆరు రోజులు గడిపాడు)

కేరళ  తిరువనంతపురంలోని కసారగాడ్‌కు చెందిన ఇద్దరు నర్సులు బహ్రెయిన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వారిద్దరికి వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో వారిద్దరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా రోగులకు వైద్యం చేస్తున్న క్రమంలో వారికి కూడా వైరస్ సోకిందని డాక్టర్లు తెలిపారు. వారి బంధువులకు కూడా రక్త పరీక్షలు చేస్తున్నారు.

కాసర్‌గోడ్‌కు చెందిన నర్స్ తల్లికి ఈ విషయం తెలిసి భయాందోళనలకు గురవుతున్నారు. ఆమెకు భర్త..ఓ కూతురు ఉన్నారు. తల్లి సహజమైన ప్రేమతో కూతురికి కరోనా వచ్చిందని తెలిసి తల్లడిల్లిపోతున్నారు. కేరళకు వచ్చేయమ్మా..ఇక్కడ వైద్యం చేయించుకుందువుగానీ అని అంటున్నారు. కానీ అలా రాకూడదని ఆ తల్లికి కూడా తెలుసు..ఆ నర్స్ కు తెలుసు..కానీ ఏమీ చేయలేని పరిస్థితి. మేము ఇక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాం..భయపడొద్దు అని తల్లికి నచ్చచెప్పిందామె.  మరో నర్స్ బంధువుల పరిస్థితి కూడా అలాగే ఉంది.

ప్రస్తుతం ఇద్దరు నర్సులు కోలుకుంటున్నట్లు హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. ఈ ఇద్దరితో కలిపి బహ్రెయిన్‌లో కరోనా బారినపడటంతో  భారతీయ నర్సుల సంఖ్య నాలుగుకు చేరింది. కాగా..బహ్రెయిన్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 195కి చేరాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా 1.26 లక్షల మందికి ఈ మహమ్మారి సోకింది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు 4,600 మంది మృత్యువాత పడ్డారు. 

See Also | ఆంటీతో జ్యోతిష్యుడి రాసలీలలు…అడ్డొచ్చిన భర్త దారుణ హత్య