ముస్లిం దేశాలపై UAE తాత్కాలిక వీసా ఆంక్షలు

  • Published By: madhu ,Published On : November 26, 2020 / 08:16 AM IST
ముస్లిం దేశాలపై UAE తాత్కాలిక వీసా ఆంక్షలు

Updated On : November 26, 2020 / 10:57 AM IST

UAE temporary visa restrictions: యూఏఈ ప్రభుత్వం 13 ముస్లిం దేశాలపై తాత్కాలికంగా వీసా ఆంక్షలను విధించింది. భద్రతా కారణాల దృష్ట్యానే ముస్లిం దేశాలపై యూఏఈ ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. ఈ ఆంక్షలతో ఆయా దేశాలకు చెందిన వారు యూఏఈ ఎంప్లాయిమెంట్, విజిట్ వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఉండదు. ప్రస్తుతం యూఏఈ వీసా కలిగి ఉన్న వారిపై మాత్రం ఎటువంటి ఆంక్షలు ఉండబోవని తెలుస్తోంది.



యూఏఈకి చెందిన ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్‌షిప్ వీసా నిషేధంపై ఇప్పటివరకు అధికారులు స్పందించలేదు. ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్‌తో యూఏఈ ప్రభుత్వం రెండు నెలల క్రితం అధికారిక సంబంధాలను ఏర్పరచుకుంది. ఈ చర్య దశాబ్దాల అరబ్ పాలసీని బ్రేక్ చేయడమే కాకుండా ముస్లిం దేశాలకు ఆగ్రహాన్ని కూడా తెప్పించింది.



https://10tv.in/new-zealand-mp-gaurav-sharma-takes-oath-in-sanskrit/
ఈ కారణంగానే తాజాగా యూఏఈ ముస్లిం దేశాలపై ఆంక్షలు విధించిందని కూడా వార్తలు వస్తున్నాయి. మరికొందరు అటువంటిది ఏమీ లేదని త్వరలోనే ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇక నిషేధం విధించిన దేశాల జాబితాలో ఇరాన్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, అల్జీరియా, కెన్యా, ఇరాక్, లెబనాన్, టునీషియా, టర్కీ తదితర దేశాలున్నాయి. సౌదీ అరేబియాలో దౌత్యవేత్తలపై బాంబు దాడి జరిగిన కొన్ని రోజులకే యూఏఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.