UK Mom Killed Hubby : భర్తతో విసుగుపుట్టి చక్కెర పానకంతో చంపేసింది

UK Mom Killed Hubby : భర్తతో విసుగుపుట్టి చక్కెర పానకంతో చంపేసింది

Uk Mom Killed Hubby 1

Updated On : July 11, 2021 / 9:51 PM IST

UK Mom Killed Hubby : భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఓ మహిళ కఠిన నిర్ణయం తీసుకుంది. భర్త వంటిపై మరుగుతున్న చక్కర పానకం పోసి హత్యచేసింది. కాగా ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని నెస్టన్ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన 59 ఏళ్ల కోరిన్నా స్మిత్ తన మైఖేల్ బెయిన్స్ (80)పై కొంత కాలంగా పట్టలేనంత కోపంతో ఉంది. ఎలాగైన అతడిని హత్యచేయాలని పథకం పన్నింది. ఈ నేపథ్యంలోనే నిద్రిస్తున్న సమయంలో అతడిపై వేడి వేడి చక్కరపానకం పోసింది.

దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మైఖేల్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మహిళను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో భర్తతో ఆమె పడిన బాధలు వివరించింది స్మిత్.. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన తండ్రి వారిపై లైగిక దాడి చేసేవాడని తెలిపింది. ఆ అవమాన భారం తట్టుకోలేక తన కుమారుడు మృతి చెందినట్లు వెల్లడించింది. అతనో సైకో అని.. తన కూతురిని కూడా లైంగికంగా వేధించేవాడని తెలిపింది.

ఇవన్నీ భరించలేక భర్తను హత్యచేసినట్లు ఒప్పుకుంది. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ప్రాసిక్యూటర్ కోర్టులో వాదిస్తూ.. మైఖేల్ తీవ్రమైన గాయాలతో చనిపోయాడని వివరించాడు. అతడి ఒంటిపై వేడి వేడి చెక్కర పానకం పోయడంతో శరీరం చూడలేని విధంగా కాలిపోయిందని, చికిత్స పొందుతూ చనిపోయాడని కోర్టుకు వివరించాడు. దీంతో కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది.

కాగా.. పెరోల్ పొందేందుకు ఆమె కనీసం 12 సంవత్సరాలైనా జైలులో గడపాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై స్మిత్ కూతురు స్పందించారు. చిన్ననాటి నుంచి.. తనపై, తన సోదరుడిపై తన తండ్రి లైంగిక దాడి చేసేవాడని, అది తట్టుకోలేక తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది.