అమెరికా, ఇరాన్ సైనిక బలాబలాలు
అమెరికాతో ఇరాన్ సైనిక బలగాలను పోల్చుకుంటే... అగ్రరాజ్యానికి ఇరాన్ ఎందులోను పోటీపడే పరిస్థితి కనిపించడంలేదు. గ్రౌండ్ ఫోర్స్‌లో ఇరుదేశాల మధ్య అసలు పోలికేలేదు.

అమెరికాతో ఇరాన్ సైనిక బలగాలను పోల్చుకుంటే… అగ్రరాజ్యానికి ఇరాన్ ఎందులోను పోటీపడే పరిస్థితి కనిపించడంలేదు. గ్రౌండ్ ఫోర్స్‌లో ఇరుదేశాల మధ్య అసలు పోలికేలేదు.
అమెరికాతో ఇరాన్ సైనిక బలగాలను పోల్చుకుంటే… అగ్రరాజ్యానికి ఇరాన్ ఎందులోను పోటీపడే పరిస్థితి కనిపించడంలేదు. అమెరికా మొత్తం సైనిక బలం 21లక్షల 46వేల మంది ఉండగా… ఇరాన్ వద్ద అందులో దాదాపు మూడో వంతు… అంటే 8లక్షల 90వేల సైనిక బలగం మాత్రమే ఉంది. కంబాట్ ట్యాంకర్లు అమెరికా వద్ద 7వేల321 ఉండగా… ఇరాన్ వద్ద అందులో సగానికి తక్కువగా.. అంటే కేవలం 2వేల531 మాత్రమే ఉన్నాయి.
గ్రౌండ్ ఫోర్స్‌లో ఇరుదేశాల మధ్య అసలు పోలికేలేదు. అగ్రరాజ్యం వద్ద సైనిక యుద్ధ వాహనాలు 41వేల760 ఉండగా… ఇరాన్ అసలు ఆ కనుచూపు మేరల్లో కూడా కనిపించడంలేదు. ఇరాన్ వద్ద కేవలం 3వేల521 సైనిక యుద్ధవాహనాలు మాత్రమే ఉన్నాయి. మిలిటరీ పోలీస్ వాహనాల విషయంలోనే సేమ్ టుసేమ్. ఈ వాహనాలు అమెరికా వద్ద 12వేల424 ఉండగా… ఇరాన్ వద్ద కేవలం ఒకవెయ్యి 722 మాత్రమే ఉన్నాయి. LU వాహనాల విషయంలోనూ ఇంతే.. అమెరికా వద్ద 72వేల236 LU వాహనాలుంటే… ఇరాన్ వద్ద 7వేల922 ఉన్నాయి. ఫిరంగుల సంఖ్యలోను ఇరుదేశాల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. అమెరికా వద్ద ఒకవెయ్యి 322 ఫిరంగులుంటే… ఇరాన్ వద్ద 621 ఫిరంగులు మాత్రమే ఉన్నాయి. రాకెట్ ప్రొజెక్టర్ల సంఖ్యలోను దాదాపు ఇదే తేడా ఉంది.
భూతలంలోనే కాదు.. గగనతలంలోను అమెరికాదే పైచేయి. అమెరికా వద్ద 13వేల 564 ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉండగా… ఇరాన్ వద్ద కేవలం 541 మాత్రమే ఉన్నాయి. యూఎస్ వద్ద 2వేల 592 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉంటే… ఇరాన్ కేవలం 178 మాత్రమే కలిగిఉంది. అమెరికా 5వేల 844 హెలికాప్టర్లను కలిగివుంటే… ఇరాన్ వద్ద 126 హెలికాప్టర్లున్నాయి. కార్గో ఎయిర్‌క్రాఫ్ట్స్ నెంబర్ పరిశీలిస్తే… అమెరికా వద్ద ఒకవెయ్యి 245, ఇరాన్ వద్ద 89 ఉన్నాయి
నేవీ బలంలోను అమెరికా కంటే ఇరాన్ ఎంతో వెనుకబడి ఉంది. అగ్రరాజ్యం వద్ద 10 నేవీ ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్స్ ఉండగా… ఇరాన్ వద్ద అసలేమీ లేవు. విధ్వంసక నౌకలు అమెరికా వద్ద 85 ఉండగా… ఇరాన్ వద్ద ఒకే ఒక్కటి ఉంది. అమెరికా అమ్ముల పొదిలో 71 జలాంతర్గాములు ఉండగా… ఇరాన్ వద్ద 40 మాత్రమే ఉన్నాయి. పెట్రోలింగ్ నౌకల్లో మాత్రం ఇరాన్ ఆధిక్యంలో ఉంది. ఇక అసలు సిసలైన అణ్వాయుధాల విషయానికి వస్తే… అమెరికా వద్ద 4వేల 18 న్యూక్లియర్ వెపన్స్ ఉండగా.. ఇరాన్ ఇద్ద ఒక్కటి కూడా లేదు.
అయితే ఓవరాల్‌గా అమెరికాకు బలం.. బలగం ఎక్కువగానే ఉన్నా.. మొత్తం సైన్యాన్ని ఇరాక్‌కు తీసుకొచ్చి యుద్ధం చేసే పరిస్థితి ఉండదు. కొంతవరకే బలగాలను తరలించగలుగుతుంది. అందుకే… అమెరికాను ఎదుర్కోగలమన్న ధీమాగా ఉంది ఇరాన్. సై అంటే సై అంటూ… యుద్ధానికి కాలు దువ్వుతోంది.