China Hypersonic Missile: చైనా హైపర్‌సోనిక్ మిస్సైల్ టెస్టును కన్ఫమ్ చేసిన అమెరికా
ఇటీవల చైనా హైపర్‌సోనిక్ క్షిపణి ప్రయోగం జరిపినట్లు.. అమెరికా రక్షణ వ్యవస్థ కన్ఫమ్ చేసింది. స్పుత్నిక్ ప్రయోగం వంటి క్షణాలుగా అమెరికా చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్క్ ..

China Experiment
China Hypersonic Missile: ఇటీవల చైనా హైపర్‌సోనిక్ క్షిపణి ప్రయోగం జరిపినట్లు.. అమెరికా రక్షణ వ్యవస్థ కన్ఫమ్ చేసింది. స్పుత్నిక్ ఉపగ్రహం ప్రయోగం వంటి క్షణాలుగా అమెరికా చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్క్ మిల్లీ అభివర్ణించారు. సోవియట్ యూనియన్ 1957లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఉపగ్రహం స్పుత్నిక్‌ని ప్రయోగించి ఆశ్చర్యపరిచింది. దీని తర్వాత ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల మధ్య అంతరిక్ష పోటీ మొదలైంది.
ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి అణు సామర్థ్యం కలిగిన ఓ హైపర్‌సోనిక్ మిసైల్ పరీక్షను చైనా మిలటరీ చేపట్టినట్లు తాజాగా బ్రిటన్‌కు చెందిన వార్తాపత్రిక “ఎన్‌హెచ్‌కే వరల్డ్” తెలిపింది. లాంగ్ మార్చ్ రాకెట్ నుంచి ఆగస్టులో చేపట్టిన ఈ ప్రయోగాన్ని చైనా రహస్యంగా ఉంచింది.
ఈ వార్త అక్టోబరు 16న బయటకు వచ్చింది. చైనా ఈ ప్రయత్నంతో అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను మాత్రం ఆశ్చర్యపరిచేలా చేయగలిగింది. అమెరికా, రష్యాతో పాటు మరో ఐదు దేశాలు ఇప్పటికే ఈ హైపర్‌సోనిక్ మిసైల్స్ ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించగల ఈ మిస్సైల్‌ను చైనా కనుక పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే అమెరికా, జపాన్ క్షిపణి రక్షణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు.
………………………………: ప్లీజ్ తక్కువ తినండి బాబు…కిమ్ వేడుకోలు
పరీక్షలో చైనా ప్రయోగించిన అస్త్రం.. నిర్దేశిత లక్ష్యానికి 32కిలోమీటర్ల దూరంలో పడింది. చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇది జరగడం గమనార్హం. ధ్వనితో పోలిస్తే కనీసం ఐదు రెట్లు వేగం (గంటకు 6వేల 200కిలోమీటర్లు)తో దూసుకెళ్లే అస్త్రాలను హైపర్ సోనిక్ క్షిపణులుగా పేర్కొంటారు. రాకెట్ సాయంతో వీటిని ప్రయోగిస్తారు. సాధారణ బాలిస్టిక్ క్షిపణులు నింగిలోకి లేచి.. అంతరిక్షంలోకి దూసుకెళ్లి.. తిరిగి భూమి దిశగా దూసుకొస్తాయి. నిర్దేశించిన లక్ష్యంపై పడతాయి. ఆర్చి ఆకారంలో వీటి పయనం సాగుతుంది.
బీజింగ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జావో లిజియాన్ మాట్లాడారు. ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించే హైపర్‌సోనిక్ మిసైల్ పరీక్షించామనేది పూర్తిగా అవాస్తవం. వివిధ రకాల పునర్వినియోగ అంతరిక్ష నౌక సాంకేతికతను ధృవీకరించడానికి ఈ ఏడాది జూలైలో సాధారణ సాధారణ అంతరిక్ష వాహన పరీక్ష నిర్వహించామని,తాము పరీక్షించి క్షిపణి కాదని సృష్టం చేశారు.
Mehreen Pirzada: ముచ్చెమటలు పుట్టించే మెరుపుతీగ మెహ్రీన్!
బ్రిటీష్ వార్తాపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. చైనా మిలిటరీ ప్రయోగించిన లాంగ్ మార్చ్ రాకెట్, హైపర్‌సోనిక్ గ్లైడ్ వాహనాన్ని మోసుకెళ్లింది. అంతరిక్షంలోని తక్కువ కక్ష్యకు చేరుకున్న తర్వాత భూమిని చుట్టుముట్టి లక్ష్యం వైపు వేగంగా కదిలింది. లక్ష్యానికి దాదాపు 32 కిలోమీటర్ల దూరంలో పడిపోయింది. ఇంత జరిగినప్పటికీ చైనా ఈ టెస్టు గురించి సీక్రెట్ మెయింటైన్ చేసింది.