స్కూల్ టీచర్ కన్నా తక్కువ టాక్స్ కట్టారు. ట్రంప్‌పై బైడెన్ ఫైర్

us presidential election 2020 : డొనాల్డ్, జో బైడెన్ మధ్య తొలి అధ్యక్ష ఎన్నికల చర్చ.. రచ్చ..రచ్చ. మెగా ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో, మరోసారి ఎన్నిక కావడానికి ట్రంప్ ఎన్నెన్ని వేషాలు వేయబోతున్నారో, బైడెన్ ఎలా కౌంటర్ చేయబోతున్నారో రుచిచూపించారు.
35 రోజుల్లోనే అధ్యక్ష ఎన్నికలు రాబోతున్నాయి. President Donald Trump, డెమోక్రాటిక్ ప్రత్యర్ధి మొదటి రౌండ్ చర్చలో పాల్గొన్నారు. హ్యాండ్ షేక్ ల్లేవు. కోవిడ్ రూల్స్ ను బట్టి, ఇద్దరూ దగ్గరకెళ్లలేదు. ఇప్పటికే ఉప్పు, నిప్పులా ఉన్న ఇద్దరు నేతలు, ఏకంగా శత్రువుల్లాగానే కనిపించారు.