ఒకప్పుడు కవలలుగా ఉన్న భూమి-శుక్రుడు ఎలా విడిపోయాయో తెలుసుకోవాలని నాసా ప్రయత్నం

ఒకప్పుడు కవలలుగా ఉన్న భూమి-శుక్రుడు ఎలా విడిపోయాయో తెలుసుకోవాలని నాసా ప్రయత్నం

Updated On : July 12, 2020 / 4:47 PM IST

నాసా శుక్ర గ్రహంపైకి మిషన్ పంపించనుంది. 2026లో దీనిని లాంచ్ చేయాలని అనుకుంటున్నారు. శుక్రగ్రహం విడుదల చేసే శక్తి, రేడియో సైన్స్, InSAR, టోపోగ్రఫీ & స్పెక్ట్రోస్కోపీ, వెరిటస్ మిషన్ లపై ఇన్వెస్టిగేషన్ జరిపి భూమి-శుక్రగ్రహం ఎలా విడిపోయాయో కనుక్కోవాలని నాసా ప్రయత్నిస్తుంది. ఆరంభంలో కలిసే ఉన్న రెండు గ్రహాలు విడిపోయి నేటికి జరిగిన పరిణామక్రియ గురించి తెలుసుకునేందుకు రీసెర్చ్ జరుగుతుంది.

శుక్రగ్రహం అనేది ఓ యాక్సిడెంట్ వల్ల ఏర్పడ్డ కాస్మిక్ గిఫ్ట్ ౌతీ నాసా జెట్ ప్రోపల్షన్ ల్యాబొరేటరి ప్రిన్సిపాల్, వెరిటాస్ ఇన్వెస్టిగేటర్ సుజానె స్మ్రేకర్ అంటున్నారు. భూమి, శుక్ర గ్రహాలు రెండూ విభిన్న కక్ష్యల్లో ప్రయాణిస్తున్నాయి అదెందుకో మీకు తెలుసా.. అవెలా విడిపోయాయో తెలుసుకోవడానికి వెరిటాస్ వీనస్ జువాలజీ ప్రకారం డేటా సేకరించాయి. గ్రహం నుంచి టెక్టోనిక్ ప్లేట్స్ ఎలా విడిపోయాయనే దానిపై చర్చిస్తున్నారు. భూమికి సమాంతరంగా ఖండాలు ఎలా ఏర్పడ్డాయని డేటా సేకరిస్తున్నారు.

శుక్రగ్రహాల్లో అగ్ని పర్వతాల విస్ఫోటనంపై మరో స్టడీ నిర్వహించారు. ‘వీనస్‌పై అగ్నిపర్వతాల విస్పోటనం గురించి అక్కడ జరిగిన ప్రక్రియ గురించి మొదలయ్యే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలనుకుంటున్నాను’ అని వెరిటాస్ టీం సభ్యుల్లో ఒకరైన జెన్నిఫర్ వైటెన్ అంటున్నారు. స్పెక్ట్రోమీటర్ సాయంతో అగ్నిపర్వతాల విస్ఫోటనాల జరిగిన తీరుపై ప్రశ్నించారు. గ్రహాల తలాలపై ఏర్పడ్డ శిలలు, అవి ఏర్పడటానికి జరిగిన కెమికల్ ప్రోసెస్ గురించి రీసెర్చ్ జరుపుతున్నారు.

దాంతో పాటుగా శుక్రగ్రహం అంతర్భాగంలో పెద్ద మొత్తంలో నీరు ఉందా లేదా.. అని కూడా చర్చిస్తున్నారు. ‘శుక్రగ్రహం గురించి రహస్యాలు వీడేందుకు దాని తలంపై పరిశోధనలు జరపాలి. భౌగోళిక పరిస్థితులు, వాతావరణ ప్రతికూలతల గురించి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుందని స్మ్రేకర్ అంటున్నారు. భూమి, శుక్ర గ్రహం ఒకే స్థాయి పదాలా .. వాటిని ఎలా ఫిక్స్ చేశారని కూడా స్టడీ చేస్తున్నారు.