నా రూటే సపరేటు : ఫేస్ మాస్క్ ధరించని అమెరికా వైస్ ప్రెసిడెంట్

  • Published By: madhu ,Published On : April 30, 2020 / 09:23 AM IST
నా రూటే సపరేటు : ఫేస్ మాస్క్ ధరించని అమెరికా వైస్ ప్రెసిడెంట్

Updated On : April 30, 2020 / 9:23 AM IST

నా రూటే సపరేట్ అంటున్నట్లుంది అమెరికా వైస్ ప్రెసిడెంట్ తీరు. ఆ దేశంలో కరోనా రాకాసి ఎలా తాండవం చేస్తుందో అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో అందరికీ మార్గదర్శకంగా ఉండాల్సిన ముఖ్యులు ఎలా వ్యవహరించాలి ? అందరికీ జాగ్రత్తలు చెప్పడం..సలహాలు ఇవ్వడం చేయాలి. కానీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పిన్స్ వ్యవహరించి తీరు వివాదాస్పదమౌతోంది.

మిన్నెసోటా లోని ఓ క్లినిక్ ను సందర్శించారు. దీనికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆయన ఎలాంటి మాస్క్ ధరించకుండానే..రోగులను పరామర్శించారు. ఆయన వెంట ఓ పది మంది దాక కూడా ఉన్నారు. కొందరు మాస్క్ లు ధరిస్తే..మైక్ ముఖానికి ఎలాంటి మాస్క్ లేదు. దీనిపై డెమోక్రటిక్ సెనేటర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని క్లినిక్ తన వెబ్ సైట్ లో వెల్లడించింది. కానీ మైక్ మాస్క్ ధరించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. క్రమం తప్పకుండా వైరస్ పరీక్షలు చేయించుకోవడం జరుగుతోందని, దీనివల్ల మాస్క్ ధరించడం లేదని పిన్స్ వెల్లడించినట్లు తెలుస్తోంది.

విమానం దిగి క్లినిక్ వెళుతున్న సమయంలో కూడా మాస్క్ ధరించలేదు. ఈయన క్లినిక్ సందర్శించిన సమయంలో కరోనా వైరస్ తో బాధపడుతున్న వారి సంఖ్య 1 మిలియన్ కు చేరుకుంది. 60 వేల మందికి పైగా చనిపోయారు. అమెరికాలో కరోనా వ్యాపిస్తున్నా..తాను మాస్క్ ధరించనని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే.