Crocodile: 80 మంది మృతికి కారణమైన మొసలి.

14 ఏళ్లలో 80 మందిని పొట్టనపెట్టుకున్న ముసలిని ఎట్టకేలకు పట్టుకున్నారు. ఉగాండాలోని లూగంగ గ్రామంలోని ఒక చెరువులో ఉంటూ అటుగా వెళ్లేవారిపై దాడిచేసి హతమార్చి తినేసేది.

Crocodile: 80 మంది మృతికి కారణమైన మొసలి.

Crocodile

Updated On : June 13, 2021 / 12:41 PM IST

Crocodile: 14 ఏళ్లలో 80 మందిని పొట్టనపెట్టుకున్న ముసలిని ఎట్టకేలకు పట్టుకున్నారు. ఉగాండాలోని లూగంగ గ్రామంలోని ఒక చెరువులో ఉంటూ అటుగా వెళ్లేవారిపై దాడిచేసి హతమార్చి తినేసేది. గడిచిన 14 ఏళ్లలో 80 మంది దీని దాడిలో బలయ్యారు.

 

మనుషులను చంపుతుండటంతో దీనికి గ్రామస్తులు ఒసామా బిన్ లాడెన్ అని పేరుపెట్టారు. దీనిని చూసిన వారిలో బతికి బయటపడ్డవారు కొందరే ఉన్నారట. దాని చేతిలో గాయపడి అంగవైకల్యులుగా మారారు. ఆ మొసలి వయసు 75 ఏళ్లు ఉంటుంది. 16 అడుగుల పొడవుతో ఉండే ఆ మొసలిని ఎట్టకేలకు గ్రామస్తులు పట్టుకున్నారు.

 

అనంతరం అటవీశాఖ అధికారులకు అప్పగించారు.