Viral Video: బిజీగా ఉన్న రహదారిపై పరుగులు తీసిన కుక్క పిల్ల.. దాన్ని కాపాడడానికి వాహనదారులంతా కలిసి..
రోడ్డుపై ఆ కుక్క వేగంగా పరుగులు తీస్తూనే ఉంది. అది ఒక్క పక్కకు వచ్చేలా కొందరు తమ వాహనాలను నడిపించారు.

chihuahua
Motorists block road: బిజీగా ఉండే రహదారిపై ఓ కుక్కపిల్ల పరుగులు తీసింది. ఈ చివావా బ్రీడ్ కుక్క పిల్ల ప్రాణాలు కాపాడడానికి వాహనదారులంతా ఒక్కటయ్యారు. రహదారిపై ఆ కుక్క పిల్లను వాహనాలు ఢీ కొట్టకుండా తమ వాహనాలను దాని వెనకాల రక్షణగా నిలిపారు.
రహదారిపై ఆ కుక్కపిల్ల దాని యజమానురాలికి చిక్కేంత వరకు వాహనదారులు దానికి ఏమీ కాకుండా రక్షించిన తీరు అబ్బురపరుస్తోంది. అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఓ కారు డోరు తెరుచుకోవడంతో అందులో నుంచి కుక్క పిల్ల కిందకు దూకింది.
బిజీగా ఉండే రహదారి కావడంతో ఆ కుక్క పిల్లను వాహనాలు ఢీ కొడతాయని దాని యజమానురాలు భయపడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు వాహనదారులు ఆ కుక్క పిల్లను ఎలాగైనా రక్షించాలని భావించి దానికి ఏమీ కాకుండా తమ వాహనాలతో రక్షణగా నిలిచారు. కుక్క రోడ్డుపై వేగంగా పరుగులు తీస్తూనే ఉంది.
ఆ కుక్క పిల్ల ఒక్క పక్కకు వచ్చేలా కొందరు తమ వాహనాలను నడిపించారు. చివరకు ఆ కుక్క పిల్లను పట్టుకున్నారు. కారులో వచ్చిన దాని యజమానురాలికి ఆ కుక్క పిల్లను అప్పగించారు. వాహనదారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి రోడ్డును బ్లాక్ చేసి, కుక్క పిల్ల ప్రాణాలు కాపాడడంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Luckily, Bean the chihuahua was saved ?#ny #nyc #newyork #newyorkcity #highway #road #traffic #cars #car #chihuahua #dog #pet #goodboy #busy #dangerous #danger #runaway #escape #scary #save #saved #fyp #animal #animals #weather #nature #clime #climeapp pic.twitter.com/YKbP0sXtbO
— Clime (@ClimeRadar) December 12, 2023
Stag beetle : చెత్తలో ఉండే ఈ పురుగు బిఎండబ్ల్యూ, ఆడి కార్ల కంటే ఖరీదైనది.. ఎందుకో తెలుసా?