Golden Dome: “గోల్డెన్ డోమ్” అంటే ఏమిటి? ఏమేం చేస్తుంది? దీన్ని ఎప్పటిలోగా సిద్ధం చేయాలని ట్రంప్ చెప్పారు?
బాలిస్టిక్ క్షిపణులు, హైపర్ సోనిక్ ఆయుధాలు, క్రూయిజ్ క్షిపణుల నుంచి అమెరికాను రక్షించడమే ఈ గోల్డెన్ డ్రోమ్ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. అంతేకాదు..

Representative Image
శత్రుదేశాల నుంచి దాడులు ఎదురైతే రక్షించుకునేందుకు ఇప్పటికే అనేక దేశాలు ఎన్నో రకాల రక్షణ వ్యవస్థలను సిద్ధం చేసుకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన రక్షణ వ్యవస్థలు తమ వద్ద ఉండాలని అనేక దేశాలు కలలు కంటుంటాయి.
శత్రుదేశాలు అత్యాధునిక ఆయుధాలతో ఎంతగా విరుచుకుపడినా వాటిని ఎదుర్కొనేలా రక్షణ వ్యవస్థలను తయారు చేసుకోవడంలో పలు దేశాలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా మరో ముందడుగు వేసింది. తమ దేశ ప్రజలు సురక్షితంగా ఉండేందుకు అత్యాధునిక గోల్డెన్ డోమ్‌ను సిద్ధం చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఈ ప్రాజెక్టు విలువ 175 బిలియన్ డాలర్లు. బాలిస్టిక్, క్రూజ్ వంటి మిసైళ్ల నుంచి అమెరికాను గోల్డెన్ డోమ్ రక్షిస్తుంది. అమెరికాను సురక్షితంగా ఉంచడానికి ఈ గోల్డెన్ డోమ్ సిస్టమ్ భూమి, అంతరిక్షం నుంచి పహారా గాస్తుంది. శత్రుదేశాల నుంచి అమెరికా దిశగా ఏవైనా మిసైళ్లు, ఇతర ఆయుధాలు వస్తే ముందుగానే గుర్తిస్తుంది.
YSRCP: ఏపీలో వైఎస్సార్‌సీపీకి మరో ఎదురుదెబ్బ.. ఏం జరిగింది?
వాటిని గగనతలంలోనే ధ్వంసం చేస్తుంది. గోల్డెన్ డోమ్ సిస్టమ్‌లో స్పేస్ నుంచి ప్రయోగించే ఇంటర్‌సెప్టర్ల నెట్‌వర్కే చాలా ముఖ్యమైనది. లేజర్ ఆయుధాలు వీటి ఉండనున్నట్లు తెలుస్తోంది. అమెరికా భూభాగం చాలా పెద్దది. దీంతో ఆ దేశంలోని అన్ని ప్రాంతాలు గోల్డెన్ డోమ్ సిస్టమ్ కింద కవర్ కావడానికి స్పేస్‌లో ఇంటర్‌సెప్టర్లతో నెట్‌వర్క్‌ను సృష్టించాలి.
లేజర్లను స్పేస్‌లోకి పంపడం సులువైన విషయం కాదు. ఇందుకు పెద్ద ఎత్తున ఇంధనం సహా ఇతర సామగ్రిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు ట్రంప్ మొదటి విడతగా 25 బిలియన్ డాలర్లు ఇస్తున్నారు. 2029 జనవరిలోగా గోల్డెన్ డోమ్ సిస్టమ్‌ను పూర్తిస్థాయిలో మోహరించాలని సంబంధిత అధికారులు ట్రంప్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షణ కోసం యూఎస్ స్పేస్‌ఫోర్స్ ఫోర్‌స్టార్ జనరల్ మైఖేల్ గుట్లిన్‌ను ట్రంప్ అపాయింట్ చేశారు.
ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కంటే మెరుగ్గా గోల్డెన్ డ్రోమ్ పనిచేస్తుంది. బాలిస్టిక్ క్షిపణులు, హైపర్ సోనిక్ ఆయుధాలు, క్రూయిజ్ క్షిపణుల నుంచి అమెరికాను రక్షించడమే ఈ గోల్డెన్ డ్రోమ్ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. అంతేకాదు, కమ్యూనికేషన్లు, జీపీఎస్, నిఘా, క్షిపణుల ట్రాకింగ్‌కు కీలకమైన ఉపగ్రహాలు సహా కీలకమైన అమెరికా అంతరిక్ష సంపదను రక్షించడం కూడా గోల్డెన్ డోమ్ లక్ష్యాలలో ఒకటి.