తన బాయ్ ఫ్రెండ్‌ను భర్తతో షేర్ చేసుకుంది

వాళ్లు ట్రిపుల్స్ అంట. ఇద్దరు దంపతులు ఒక సంతానం ఉన్న ట్రిపుల్ కాదు. ఇద్దరు మగాళ్లు ఒక ఆడ కలిసి కాపురం చేస్తున్న ట్రిపుల్స్. ఆరేళ్ల దాంపత్య జీవితం తర్వాత ఆ మహిళ తమ జీవితంలోకి వచ్చిందంటూ చెబుతున్నారు. క్రిస్(38), మ్యాట్ బ్రాండ్(28)అనేఇద్దరు యువకులు కొన్నేళ్లుగా కలిసి ఉంటూ 2015లో కైట్ ఎర్నెస్ట్(28)ని తమ ప్రపంచంలోకి ఆహ్వానించారు.
ఈ ముగ్గురికి ఒకే బెడ్ రూమ్. ఒకటే బెడ్ కూడా.. అందరికీ వింతగా అనిపించి.. వారి రిలేషన్ గురించి తెలిసి తెగ సెర్చ్ చేయడంతో సెలబ్రిటీలు అయిపోయారు. ‘ముందుగా నాకు మ్యాట్ చెప్పినప్పుడు ఒప్పుకోలేదు. ఆ తర్వాత చర్చల్లో మా ఆలోచనలు కలవడంతో కలిసి ఉంటున్నాం. ఏడెనిమిది నెలలు కలిసి గడిపిన తర్వాత తను వారానికి ఐదు రోజులు మాతోనే ఉంటుంది’
దీనిపై ఆ మహిళ మాట్లాడుతూ.. నేను మగాళ్లతో రిలేషన్‌లో ఉండటం తప్పుగా అనిపించలేదు. వారిద్దరూ బై సెక్సువల్. పరిచయమైన కొత్తలో వారితో విడివిడిగా గడపడం నచ్చేది కాదు. వాళ్లు ఒకరికొకరు అన్యోన్యంగా ఉండటం చూసి అసూయగా అనిపించేది. నాకు వీళ్లు ఎంత ప్రియారిటీ ఇస్తున్నారో అర్థం అయ్యేది కాదు. ఆ తర్వాత కొద్ది నెలల పరిచయం తర్వాత ముగ్గురం కలిసే సమానంగా ఉంటున్నాం’ అని చెప్పింది.
ఇంకా వాళ్లలో ఏవైనా బహమతులు ఇచ్చుకునే సందర్భాల్లో ఒకరు మిగిలిన ఇద్దరికీ ఒకే రకమైన గిఫ్ట్‌లు ఇచ్చుకుంటారట. నిశ్చలమైన నదిపై ప్రశాంతంగా పడవ ప్రయాణం చేస్తున్నట్లు బతికేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఇంట్లో ఒకే రకమైన రెండు కుక్కలు కూడా పెంచుకుంటున్నారు. క్రిస్టమస్‌లు, బర్త్ డేలు ప్రత్యేకమైన వేడుకలు కూడా జరుపుకుంటారట.
Read More>>కేసీఆర్ జన్మదినం – ఘనంగా హరిత హారం..