డెడ్ ట్రీ కి లైఫ్ ఇచ్చిన మహిళా

  • Published By: veegamteam ,Published On : January 31, 2019 / 11:30 AM IST
డెడ్ ట్రీ కి లైఫ్ ఇచ్చిన మహిళా

Updated On : January 31, 2019 / 11:30 AM IST

మనసుంటే మార్గం ఉంటుంది. అమెరికాలోని ఓ మహిళ కూడా తన మనసు పెట్టి ఆలోచించింది. దాదాపు చనిపోయే దశలో ఉన్న 110 ఏళ్ల చెట్టును ఓ లైబ్రరీగా మార్చేసింది. సాధారణంగా ఇలాంటి చెట్టు మన దగ్గర ఉంటే కుళ్లపోతుందంటూ నరికేస్తాం. 

కానీ ఓ ఆర్టిస్ట్ కమ్ లైబ్రేరియన్ అయిన షరాలీ ఆర్మిటేజ్ మాత్రం అలా చేయలేదు. వయసు మీద పడుతున్న ఈ చెట్టు పూర్తిగా ఎండిపోయి కొమ్మలు విరిగి పడుతున్నాయి. గత ఏడాది అలాగే  కొమ్మ విరిగి పడి ఓ కారు ధ్వంసమైంది. దీంతో లాభం లేదు అనుకొని నవంబర్‌లో ఈ చెట్టును సగానికిపైగా నరికేసింది. ఆ తర్వాత మిగిలి ఉన్న కాండాన్ని ఓ అందమైన లైబ్రరీగా మార్చింది.   

ఆ చెట్టుకి లిటిల్ ఫ్రీ లైబ్రరీగా పేరు పెట్టింది. నిజానికి ఈ పేరుతోనే ఓ ఎన్జీవో ఉంది. దీనికి 88 దేశాల్లో లైబ్రరీ షేరింగ్ నెట్‌వర్క్ ఉంది. ఎవరికి ఏ బుక్ కావాలన్నా తీసుకోవడం, చదివిన వెంటనే తిరిగి ఇచ్చేయడం అంతా ఫ్రీనే. ఇప్పుడా నెట్‌వర్క్‌లోనే ఈ చెట్టు లైబ్రరీని చేర్చింది షరాలీ. చెట్టు కాండానికి ఓ డోర్ పెట్టింది. లోపల అరలు ఏర్పాటు చేసి బుక్స్‌ను అందులో ఉంచింది. ఈ చెట్టు లైబ్రరీ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.. ఇప్పటికే లక్షకుపైగా షేర్ చేశారు.