Amarnath Yatra : అమరనాథ్ యాత్రకు మూడంచెల అధునాతన భద్రత

భారత సైనికులు అమరనాథ్ యాత్రికులకు మూడంచెల అధునాతన భద్రత కల్పించారు. క్వాడ్‌కాప్టర్‌లు, నైట్ విజన్ పరికరాలు, యాంటీ డ్రోన్ బృందాలు, బాంబ్ స్క్వాడ్‌లతో యాత్రికులకు మూడు అంచెల భద్రతను కల్పించినట్లు ఇండియన్ ఆర్మీకి చెందిన బ్రిగేడియర్ అమన్‌దీప్ మహ్లీ చెప్పారు....

Amarnath Yatra : అమరనాథ్ యాత్రకు మూడంచెల అధునాతన భద్రత

Amarnath Yatra

Amarnath Yatra : భారత సైనికులు అమరనాథ్ యాత్రికులకు మూడంచెల అధునాతన భద్రత కల్పించారు. క్వాడ్‌కాప్టర్‌లు, నైట్ విజన్ పరికరాలు, యాంటీ డ్రోన్ బృందాలు, బాంబ్ స్క్వాడ్‌లతో యాత్రికులకు మూడు అంచెల భద్రతను కల్పించినట్లు ఇండియన్ ఆర్మీకి చెందిన బ్రిగేడియర్ అమన్‌దీప్ మహ్లీ చెప్పారు. (Amarnath Yatra Security Upgraded) శ్రీనగర్, జమ్మూ, కాశ్మీర్ అమర్‌నాథ్ యాత్రికులకు భారత సైన్యం అప్‌గ్రేడ్ చేసిన మూడు-అంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. (Army Implements Three-Tier Security System)

BEL Recruitment : భారత్‌ ఎలక్ట్రానిన్స్‌ లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

యాత్ర మార్గంలో భారతీయ సైన్యం, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌తో కూడిన బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 24 గంటల పాటు వైమానిక నిఘా ఏర్పాటు చేశారు. గత సంవత్సరం క్లౌడ్ బర్స్ట్ సంఘటన నుంచి నేర్చుకున్న పాఠాలతో విపత్తు సహాయ ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి సారించారు. యాత్ర మార్గంలో హెలిప్యాడ్ లు, వైద్యబృందాలను ఏర్పాటు చేశారు.

PM Modis US Tour : మోదీ అమెరికా పర్యటనతో గుజరాత్‌కే అధిక ప్రయోజనం…సీఎం భూపేంద్ర పటేల్ వ్యాఖ్యలు

హిమపాతం సంభవించే ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలను నియమించారు. పంచతర్ని, నున్వాన్ వద్ద యాత్రికుల నివాస సౌకర్యాలను మెరుగుపర్చారు. 14 అడుగుల వరకు మంచు ఉన్న దక్షిణ మార్గాన్ని క్లియర్ చేయడంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కీలక పాత్ర పోషించింది. 62 రోజుల పాటు సాగనున్న అమర్‌నాథ్ యాత్రలో భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని సైన్యం హామీ ఇచ్చింది.