CBSE: 12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన సీబీఎస్ఈ
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్‌ఈ) 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఇవాళ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం 92.71గా ఉందని సీబీఎస్ఈ తెలిపింది. cbse.gov.in, results.cbse.nic.in వెబ్‌సైట్లలో విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్లను ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. సీబీఎస్ఈ 12వ తరగతి టెర్మ్-2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జూన్ 4 వరకు జరిగాయి.

Cbse To Restore Single Board Exams Format From Next Academic Year
CBSE: కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్‌ఈ) 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఇవాళ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం 92.71గా ఉందని సీబీఎస్ఈ తెలిపింది. cbse.gov.in, results.cbse.nic.in వెబ్‌సైట్లలో విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్లను ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. సీబీఎస్ఈ 10, 12వ తరగతి టెర్మ్-2 పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి జూన్ 15 వరకు జరిగిన విషయం తెలిసిందే. వాటిలో 12వ తరగతి టెర్మ్-2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జూన్ 4 వరకు జరిగాయి. మొత్తం 35 లక్షల మందికిపైగా విద్యార్థులు 10, 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు.
2021-21 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ రెండు టెర్మ్‌లుగా పరీక్షలు నిర్వహించింది. సీబీఎస్ఈ టెర్మ్-1 పరీక్షలు గత ఏడాది నవంబరు-డిసెంబరులో జరగాయి. తుది మార్కు షీట్‌ను సీబీఎస్ఈ టెర్మ్-1, టెర్మ్-2 పరీక్షల ఆధారంగా రూపొందించింది. విద్యా సంవత్సరంలో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులు, ప్రాజెక్టు వర్క్స్, ప్రాక్టికల్ పరీక్షలు, ప్రీ-బోర్డ్ పరీక్షల వివరాలతో కూడుకుని స్కోరుకార్డు ఉంటుంది.
Youtube Channel: యూట్యూబ్ వ్యూస్ కోసం సూసైడ్ చేసుకున్న స్టూడెంట్