Junior Mirabai Chanu : చిన్నారి మీరాబాయ్ చాను…వైరల్ గా మారిన వీడియో

Junior Mirabai Chanu : చిన్నారి మీరాబాయ్ చాను…వైరల్ గా మారిన వీడియో

Meera Bai Chanu

Updated On : July 27, 2021 / 2:12 PM IST

Junior Mirabai Chanu : వెయిట్ లిఫ్టర్ గా ఫోజులిస్తున్న ఓచిన్నారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అచ్చం మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను లాగే అనుకరిస్తున్న ఈ విడియోను చూసి నెటినజన్లు పడిపడి నవ్వుకుంటున్నారు. చిన్నారి వెనుక టివిలో మీరాబాయి జాను దృశ్యాలు కనిపిస్తుండగా ఆమె ఎలా చేస్తుందో సేమ్ టూ సేమ్ గా ఈ చిన్నారి అనుకరించటం విశేషం..

ఈ చిన్నారి ఎవరో కాదు వెయిట్ లిఫ్టర్ సతీష్ శివలింగం కుమార్తె…భారత మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను టోక్యో ఒలంపిక్స్ లో రజతపతకం సాధించిన నేపధ్యంలో తన కుమార్తె అమెను అనుకరిస్తున్న దృశ్యాలను సతీష్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియోలో తానో పెద్ద అరితేరిన క్రీడాకారిణాలా ఫోజులిస్తూ చిన్నారి బరువు ఎత్తటాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చిన్నారి పవర్ లిఫ్టర్ వీడియో హల్ చల్ చేస్తుంది. లైకులు, కామెంట్లతో నెటిజన్లు ముంచెత్తుతున్నారు. భవిష్యత్తులో ఈ చిన్నారి మీరాబాయి చాను లా మంచి వెయిట్ లిఫ్టర్ కావాలంటూ తమ అకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 2లక్షలమందికి పైగా వీక్షించగా, 21వేలకు పైగా లైకులు వచ్చాయి.