ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్

  • Published By: bheemraj ,Published On : December 3, 2020 / 08:55 AM IST
ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్

Updated On : December 3, 2020 / 8:56 AM IST

CM KCR attend Nomula Narsimhaiya’s funeral : నేడు నల్గొండ జిల్లాకు సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు. నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు కేసీఆర్‌ హాజరు కానున్నారు. నర్సింహయ్య స్వగ్రామమైన నకిరేకల్‌ మండలం పాలెంలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.



దీంతో ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి బయల్దేరి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 11 గంటల 25 నిమిషాలకు పాలెం చేరుకుంటారు. అంత్యక్రియలు ముగిసే వరకు అక్కడే ఉంటారు. అనంతరం తిరుగు ప్రయాణమై మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు బేగంపేటకు చేరుకుంటారు.



నోముల నర్సింహయ్య గుండె పోటుతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (డిసెంబర్1, 2020) మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నారు. 2014 ఎన్నికలకు ముందు నోముల టీఆర్ఎస్ లో చేరారు.



అంతకు ముందు సీపీఎంలో కీలక నేతగా ఉన్నారు. సీపీఎం తరపున నకిరేకల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై నోముల గెలుపొందారు.