Krishna Health Updates: మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్.. డయాలసిస్ జరుగుతోంది.. ఇప్పుడే ఏమీ చెప్పలేము : డా గురు ఎన్ రెడ్డి
కృష్ణగారి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నాం. ఉదయం నుంచి 8 మంది డాక్టర్లు కృష్ణగారికి చికిత్సను అందిస్తున్నారు. లివర్, కిడ్నీ, లంగ్స్‌పై ప్రభావం పడింది. మరో 24 గంటలు అబ్జర్వేషన్‌లోనే ఉండాలి.

Continental Hospital Chairman Dr Guru N Reddy About Krishna Health Updates
Krishna Health Updates: సూపర్ స్టార్ కృష్ణ కార్డియాక్ అరెస్ట్ తో ఇవాళ ఉదయం కాంటినెంటల్ హాస్పిటల్ లో అడ్మిట్ అవగా, డాక్టర్లు వెంటనే CPR అందించి ఆయన్ను ఐసీయూకు షిఫ్ట్ చేసి వెంటిలేటర్ పై వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి మధ్యాహ్నం ఆసుపత్రి వర్గాలు ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వారు పేర్కొన్నారు. ఆయనకు స్పెషలిస్టుల బృందం పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరుగుతోందని తెలిపారు.
Super Star Krishna : ఎక్స్‌క్లూజివ్.. కృష్ణ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల..
దీంతో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అందరూ ఆందోళనగా ఉన్నారు. అయితే తాజాగా కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మన్ డా. గురు ఎన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కృష్ణగారి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నాం. ఉదయం నుంచి 8 మంది డాక్టర్లు కృష్ణగారికి చికిత్సను అందిస్తున్నారు. లివర్, కిడ్నీ, లంగ్స్‌పై ప్రభావం పడింది. మరో 24 గంటలు అబ్జర్వేషన్‌లోనే ఉండాలి. కృష్ణగారికి డయాలిసిస్ జరుగుతోంది. మిగతా అవయాల పనితీరు మందగించింది. ప్రస్తుతానికి బ్రెయిన్ డెడ్ అవలేదు కానీ, బ్లీడింగ్ అవుతోంది. ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలను రేపు మధ్యాహ్నం 1 గంట బులెటిన్‌లో తెలియజేస్తాం’’ అని అన్నారు.
Super Star Krishna: విషమంగా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం.. వెంటిలేటర్‌పై ఐయూసీలో చికిత్స..
ఈ అప్డేట్‌తో సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది. అయితే ఆయన శ్వాసతీసుకుంటున్నారని.. డాక్టర్లు ఆయన్ను మినట్ టు మినట్ అబ్జర్వేషన్‌లో ఉంచారని తెలిసి వారు కాస్త ఊరట చెందుతున్నారు. ఇక తమ అభిమాన నటుడు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా బయటకు రావాలని కృష్ణ అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.