Doctor Beats Woman Patient : మహిళా రోగిని చితకబాదిన డాక్టర్ ..

ఆస్పత్రిలో ఓ డాక్టర్ ట్రీట్ మెంట్ కోసం వచ్చిన మహిళా రోగిని చితకబాదాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డాక్టర్అయి ఉండి ఏమాత్రం విచక్షణ లేకుండా రోగిని చితకబాదాడు.

Doctor Beats Woman Patient : మహిళా రోగిని చితకబాదిన డాక్టర్ ..

Drunk Doctor Beats Woman Patient

Updated On : November 10, 2022 / 3:52 PM IST

Drunk Doctor Beats Woman Patient : ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఓ డాక్టర్ ట్రీట్ మెంట్ కోసం వచ్చిన మహిళా రోగిని చితకబాదాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డాక్టర్అయి ఉండి ఏమాత్రం విచక్షణ లేకుండా రోగిని చితకబాదాడు. దీనికి కారణం అంతకంటే దారుణంగా ఉంది.డాక్టర్అయి ఉండి హాస్పిటల్ కు మద్యం తాగి వచ్చాడు. తాగిన మత్తులో మహిళా రోగిని చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో అదికాస్తా సదరు హాస్పిటల్ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ అవినాష్ మెష్రామ్ దృష్టికి వచ్చింది. దీంతో డీన్ సదరు డాక్టర్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

సదరు బాధిత రోగి కుమారుడు శ్యామ్‌ కుమార్‌ తన తల్లి సుఖమతి ఆరోగ్యం అస్సలు బాగాలేకపోవటంతో 108,112 కు కాల్ చేశాడు. కానీ ఏ వాహనం రాలేదు. దీంతో అర్థరాత్రి సమయంలోనే తల్లిని ఆటో రిక్షాలో కోర్బా జిల్లా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో హాస్పిటల్ లో డ్యూటీలో ఓ డాక్టర్ మాత్రమే ఉన్నాడు. దీంతో డాక్టర్ మా అమ్మ ఆరోగ్యం అస్సలు బాగాలేదు కాస్త చూడండీ అంటూ వేడుకున్నాడు. కానీ అప్పటికే డ్యూటీలో ఉన్న ఆ డాక్టర్ మద్యం తాగి ఉన్నాడు. దీంతో తనను డిస్ట్రబ్ చేసారనే కోపంతో సమయం సందర్భం లేదా అంటూ కేకలేశాడు. కానీ మా అమ్మ ఆరోగ్యం అస్సలు బాగాలేదు చూడండీ అంటూ కోరాడు.

దీంతో చిర్రెత్తుకొచ్చింది సదరు డాక్టర్ కు. తానో డాక్టర్ ని అనే విషయం కూడా మర్చిపోయాడు. రోగిని పట్టుకుని కొట్టాడు. చికిత్స సమయంలో వైద్యుడు తన తల్లిని కొట్టాడని ఆరోపించాడు శ్యామ్‌ కుమార్‌. ఘటనకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇది హాస్పిటల్ డీన్ దృష్టికి వెళ్లటంతో సదరు డాక్టర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. దీనిపై విచారణ కొనసాగుతోందని..తెలిపారు.