Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. భయంతో ప్రజల పరుగులు!
అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. వెస్ట్ కామెంగ్‌లో తెల్లవారు జామున 4.53గంటల సమయంలో ప్రకంపనలు రావడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుండి బయటకు పరుగులు పెట్టారు.

Earthquake Arunachal Pradesh
Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. వెస్ట్ కామెంగ్‌లో తెల్లవారు జామున 4.53గంటల సమయంలో ప్రకంపనలు రావడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుండి బయటకు పరుగులు పెట్టారు. రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
అసోంలోని తేజ్‌పూర్‌కు 53 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సిస్మోలజీ తెలిపింది. అయితే, ఈ ప్రకంపనలతో ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ లో తరచుగా భూకంపాలు సంభవించడం సాధారణం కాగా ఈ ఏడాది ఇప్పటికే ఫిబ్రవరిలో ఒకేసారి, మే నెలలో మరోసారి ప్రకంపనలు సంభవించగా ఈ ఏడాది ప్రకంపనలు రావడం ఇది మూడవసారి.