road accident : రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి

కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తండ్రీ కూతురు చనిపోయారు. 65వ నంబరు జాతీయ రహదారిపై భీమవరం టోల్‌ ప్లాజా దగ్గర ఈ ప్రమాదం జరిగింది.

road accident : రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి

Updated On : March 30, 2021 / 10:28 AM IST

Father and daughter killed in road accident : కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తండ్రీ కూతురు చనిపోయారు. 65వ నంబరు జాతీయ రహదారిపై భీమవరం టోల్‌ ప్లాజా దగ్గర ఈ ప్రమాదం జరిగింది. లారీ ఒక్కసారిగా ఆగిపోవడంతో వెనక ఉన్న బైక్..దాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో బైక్‌పై తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తున్నారు.

తండ్రి, చిన్న పాప బైక్‌ పై నుంచి పడి అక్కడికక్కడే చనిపోయారు. తల్లి, పెద్ద కూతురుకు గాయాలయ్యాయి. వారిని జగ్గయ్య పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విజయవాడ వైపు నుంచి సూర్యాపేట వైపు వెళ్లే మార్గంలో ప్రమాదం జరిగింది.

కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకున్నట్లు తెలుస్తోంది. తండ్రీ, కూతురు చనిపోవడంతో కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.