Gangula Kamalakar: డ‌బ్బుల కోసం మంత్రి గంగుల కొత్త‌ పీఆర్వో డిమాండ్.. ఆడియో లీక్

తెలంగాణ‌ మంత్రి గంగుల కమలాకర్ వ‌ద్ద పీఆర్వోగా చేరి నెల‌రోజులు కూడా గ‌డ‌వ‌కముందే బోనాల మల్లికార్జున్​ అనే వ్య‌క్తి ఒక‌రి నుంచి డ‌బ్బులు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. దీంతో మంత్రి పీఆర్వో ఆడియోపై పోలీసులు విచారణ జ‌రుపుతున్నారు.

Gangula Kamalakar: డ‌బ్బుల కోసం మంత్రి గంగుల కొత్త‌ పీఆర్వో డిమాండ్.. ఆడియో లీక్

Ministar Gangula

Updated On : June 23, 2022 / 9:09 AM IST

Gangula Kamalakar: తెలంగాణ‌ మంత్రి గంగుల కమలాకర్ వ‌ద్ద పీఆర్వోగా చేరి నెల‌రోజులు కూడా గ‌డ‌వ‌కముందే బోనాల మల్లికార్జున్​ అనే వ్య‌క్తి ఒక‌రి నుంచి డ‌బ్బులు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. దీంతో మంత్రి పీఆర్వో ఆడియోపై పోలీసులు విచారణ జ‌రుపుతున్నారు. డబ్బులు డిమాండ్ చేసిన బోనాల మ‌ల్లికార్జున్‌పై మంత్రి గంగుల సీరియస్ అయ్యారు.

JEE Main 2022: నేటి నుంచి జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు  

మల్లికార్జున్‌ను విధుల నుంచి తొలగించారు. స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానంటూ ఓ వాటర్ ప్లాంట్ యజమాని వద్ద బోనాల మ‌ల్లికార్జున్ డబ్బులు డిమాండ్ చేశారు. సీఐ, ఏసీపీలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందంటూ మల్లికార్జున్ చెప్పిన‌ట్లు ఆడియోలో ఉంది. ఆ ఆడియోలో పోలీసుల ప్రస్తావనపై జిల్లా పోలీసు అధికారులను అదనపు డీజీపీ నాగిరెడ్డి వివరణ కోరారు. డీసీపీ నేతృత్వంలో కరీంనగర్ సీపీ సత్యనారాయణ విచారణకు ఆదేశించారు.