అవే డైలాగ్స్, అదే ఫోర్స్, అదే యాక్షన్ : హ్యాపీ బర్త్ డే బాలకృష్ణ

నీ ఇంటికొస్తా..నీ నట్టింటికొస్తా అంటూ.. ఫ్యాక్షన్ పవర్ చూపిస్తారు. చూడు.. ఒకవైపే చూడు.. రెండో వైపు చూడాలనుకోకు అంటూ.. విలన్లను పవర్ ఫుల్ పంచ్ ల తోనే పడగొడతారు. రణమా..శరణమా అంటూ శతృవులతో యుద్దం చెయ్యకుండానే చుక్కలు చూపిస్తారు.. ఎవరేదారి అయినా నాది మాత్రం యాక్షన్ దారే అంటున్నారు నందమూరి బాలకృష్ణ.
సుమోలు గాల్లోకి లేపాలన్నా..తొడగొట్టి ట్రైన్ లు ఆపాలన్నా.. కంటి చూపుతో చంపాలన్నా…చూస్కుందామా నీ ప్రతాపమో నా ప్రతాపమో అని సీమ శత్రువుల్ని సవాల్ చెయ్యాలన్నా.. ఒక్క బాలయ్యకే సాధ్యం. ఇప్పటి వరకూ ఇలాంటి పవర్ ఫుల్ మాస్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసిన బాలకృష్ణ.. సెంచరీ కి పైగా సినిమాలు చేసినా..యాక్షన్ హీరోగానే ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్నారు.
కెరీర్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించినా, రొమాన్స్ తో అలరించినా.. జానపదాలు చేసినా, క్లాస్, ఫ్యామిలీ, సోషల్, ఫోక్లోర్, మూవీస్ జానర్ నుంచి బాలయ్య లోని మరో కోణాన్ని చూపించిన చిత్ర సమరసింహా రెడ్డి. నిజానికి ఈ సినిమా బాలకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడని చెప్పొచ్చు. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ కు ల్యాండ్ మార్క్ గా చెప్పుకోవచ్చు.
తెలుగు సినిమా ఫ్యాక్షన్ ట్రెండ్ తీసుకువచ్చిన హీరో కూడా బాలయ్యే. చాలామంది హీరోలు ఈ టైప్ క్యారెక్టర్స్ చేసినా, ఆడియన్స్ ని ఎక్కువ ఎంటర్ టైన్ చేసింది మాత్రం అన్ డౌటెడ్ లీ బాలకృష్ణే. అంతేకాదు బాలకృష్ణ కెరీర్ తడబడుతున్న ఈ మద్య కాలంలో కూడా మరోసారి ఫ్యాక్షన్ నేపధ్యంతో సాగే సింహా సినిమాతో మరోసారి సక్సెస్ అందుకున్నారు బాలయ్య. మరి మా బాలయ్య యాక్షన్ పవర్ అలాంటిదంటారు ఫ్యాన్స్ .
ఈ సినిమా తర్వాత వచ్చిన లెజెండ్ కూడా బాలకృష్ణ మార్క్ స్టామినా ను మరోసారి ప్రూవ్ చేసింది. పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యడం బాలయ్య బాబుకే సాధ్యం. అంతేకాదు.. డిక్టేటర్ అంటూ బాక్సాఫీస్ ను డిక్టేట్ చేశాడు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పట్టించుకోకుండా తన రూట్లో యాక్షన్ చేసుకుంటూ వెళ్లడం బాలయ్య కు అలవాటు.
డిఫరెంట్ మూవీస్ చేస్తూ బాలయ్య తన యాక్టింగ్ లోని చాలా యాంగిల్స్ ని ఆడియన్స్ కి పరిచయం చేశారు. తన తోటి హీరోలు కమర్షియల్ మూవీస్ చేస్తుంటే.. బాలయ్య మాత్రం డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని సెలక్ట్ చేసుకున్నారు. బట్.. వాటిలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా జాగ్రత్తపడ్డారు. ముఖ్యంగా ఫ్యాన్స్ ఎప్పుడూ కోరుకునే యాక్షన్ ని మాత్రం అస్సలుమిస్ అవ్వనివ్వలేదు బాలకృష్ణ.
తనతో పాటు ఇండస్ట్రీలో కి వచ్చినవాళ్లు సోలో సినిమాలు తగ్గించేసి.. మల్టీస్టారర్స్ , స్టోరీ డ్రివెన్ సినిమాలు చూస్తున్నారు. మరి మీసంగతేంటని అడిగితే..మనం మల్టీస్టారర్ చెయ్యాలంటే కథ మామూలుగా ఉండకూడదు.. తగిన గ్రాండియర్ ఉండాలని చెబుతున్నారు. మిగతా సీనియర్ హీరోలెలా ఉన్నా.. బాలయ్య మాత్రం ఇంకా సోలో గానే యంగ్ హీరోలతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నారు . స్టిల్ వాళ్లతో సమానంగా డ్యాన్సులు, యాక్షన్ సీన్స్ చేస్తున్నారు.
కథలో కంటెంట్ ఉన్నా లేకపోయినా.. టైటిల్స్ తో ఆడియన్స్ ని ట్రాక్ లో పెట్టడం ఓన్లీ బాలయ్యకే సాధ్యం. పవర్ ఫుల్ టైటిల్స్ తో సినిమాపై ..ఈ వయసులో కూడా ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఆల్ మోస్ట్ చేస్తున్న వన్నీ మొనాటనస్ కమర్షియల్ మూవీస్ అయినా కూడా తనకు, తన టైటిల్స్ కు ఏమాత్రం ఇమేజ్ తగ్గలేదని ప్రూవ్ చేసుకుంటున్నారు బాలయ్య. సినిమాలో తన క్యారెక్టరిస్టిక్స్ ని ఎలివేట్ చేసేలా సింహ, లెజెండ్, జయసింహ, రూలర్ ..లాంటి టైటిల్ పెడుతున్నారు మేకర్స్.
హీరోగా తిరిగులేని మాస్ ఇమేజ్ ఉన్నా.. ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడూ ముందే ఉంటాడీ నందమూరి అందగాడు. కమర్షియల్ సినిమాలే అయినా కూడా తన స్టైల్ ని, ఫ్యాన్స్ పల్స్ ని మిస్ అవ్వకుండా యాక్షన్ మాత్రం చేస్తారు బాలయ్య. పౌరాణికంగా తెరకెక్కిన తన 100వ సినిమా శాతకర్ణి కథను నేటి తరానికి పరిచయం చేశారు. భారీ యుద్ధ సన్నివేశాలు, సెట్టింగ్, విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన శాతకర్ణి సినిమాను అతి తక్కువ సమయంలో పూర్తి చేసి ఈ వయసులోనూ తనలో జోష్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు.
హీరోయిజాన్ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో పైసా వసూల్ సినిమా చేసి సర్ ప్రైజ్ చేశారు బాలయ్య. అవే డైలాగ్స్ అదే ఫోర్స్, అదే యాక్షన్, అదే రివేంజ్, అదే వయెలెన్స్-అదేరొమాన్స్.. . బాలయ్య అస్సలు దేన్లోనూ తగ్గట్లేదు. ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా.., బాలయ్య మాత్రం అస్సలు తనరూట్ మార్చుకోనంటున్నారు. ఎంత మంది డైరెక్టర్లు మారినా.. ఎన్ని సినిమాలు చేసినా బాలయ్య స్టైల్ మాత్రం యాక్షనే..అదేఅగ్రెషన్, అదే ఎనర్జీ, అదే సాలిడ్ డైలాగ్ డెలివరీ తో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నారు బాలకృష్ణ.
కంప్లీట్ కమర్షియల్ రివేంజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న బోయపాటి సినిమాలో బాలయ్య డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు. తన స్టైల్లో యాక్షన్ ని ఎలివేట్ చేస్తూ..బోయపాటి డైరెక్షన్లో వస్తున్నసినిమాలో కూడా బాలయ్య డిఫరెంట్ గెటప్స్ తో ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యబోతున్నారు. ఈ యాక్షన్ కాంబినేషన్ మీద ఇప్పటికే ఎక్స్ పెక్టేషన్స్ ఫుల్ గా ఉన్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.