Heavy Rains : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు, వరదలు.. నలుగురి మృతి

రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీవర్షాల వల్ల వరదలు రావడంతో నలుగురు మరణించారు. ముంబయి, మధ్య మహారాష్ట్రతో సహా మహారాష్ట్రలోని కోస్తా ప్రాంతాల్లో రాబోయే 48 గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది....

Heavy Rains : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు, వరదలు.. నలుగురి మృతి

Heavy rain

Updated On : June 26, 2023 / 12:50 PM IST

Heavy Rains : రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీవర్షాల వల్ల వరదలు రావడంతో నలుగురు మరణించారు. ముంబయి, మధ్య మహారాష్ట్రతో సహా మహారాష్ట్రలోని కోస్తా ప్రాంతాల్లో రాబోయే 48 గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో వర్షాల కారణంగా నలుగురు వ్యక్తులు మరణించారు.

Monsoon Warnings issued : రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు, వరదలు

రుద్రప్రయాగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో వాహనం శిథిలాల కింద చిక్కుకోవడంతో 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మరో ఘటనలో ఉత్తరకాశీ జిల్లా పురోలా తహసీల్‌లోని కంద్యాల్ గ్రామంలో పొలంలో నాట్లు వేస్తుండగా పిడుగుపాటుకు గురై ఒక యువకుడు మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుడు అభిషేక్ (20)గా గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్, సిమ్లా జిల్లాల్లో ఒక్కొక్కరు గల్లంతైనట్లు రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వెల్లడించింది.

AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో రెండు రోజులు వర్షాలు, సముద్రంలో అల్లకల్లోలం

కులూ-మండీ జాతీయ రహదారిపై వరద నీటి ప్రవాహం వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీవర్షాల నేపథ్యంలో డెహ్రాడూన్ లో ఉత్తరాఖండ్ సీం సమీక్షించారు. వర్షాలు తగ్గాకే ఛార్ ధామ్ యాత్రికులు యాత్రను కొనసాగించాలని సీఎం సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో కొండచరియలు విరిగిపడటంతో పలు రోడ్లు బ్లాక్ అయ్యాయి. గంగాతో సహా అనేక నదుల్లో నీటి మట్టం పెరిగింది. సిమ్లా, మండి, కులులలో భారీ వర్షం కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. రానున్న 48 గంటల్లో ముంబయి, మధ్య మహారాష్ట్ర సహా తీర ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం విభాగం అధికారులు చెప్పారు.