GDP: పెరిగిన భారత జీడీపీ వృద్ధిరేటు
దేశంలో ద్రవ్యలోటు కూడా బాగా పెరిగింది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికిగాను, జీడీపీలో ద్రవ్యలోటు 6.7 శాతంగా నమోదైంది. ఇది ‘కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ’ వేసిన అంచనాల కంటే తక్కువ.

Gdp
GDP: భారత జీడీపి వృద్ధిరేటు 8.7 శాతం నమోదైనట్లు తాజా సర్వే వెల్లడించింది. 2021-22 సంవత్సరానికిగాను 8.7 శాతం జీడీపీ నమోదైంది. 2020-21లో ఇది 6.6 శాతంగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మెరుగైన పెరుగుదలగానే చెప్పుకోవచ్చు. ఈ ఏడాది జనవరి త్రైమాసికంలో 4.1 శాతం వృద్ధి కనిపించింది.
Mamata Banerjee: బీజేపీకి 2024లో నో ఎంట్రీ: మమతా బెనర్జీ
అయితే, అంతకుముందు త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)తో పోలిస్తే ఇది తక్కువే. ఈ త్రైమాసికంలో 5.4 శాతం వృద్ధి నమోదైంది. అంతకుముందు కేంద్ర అంచనా ప్రకారం 2021-22లో జీడీపీ 8.9 శాతంగా ఉండొచ్చని అంచనావేసింది. మరో డాటా ప్రకారం దేశంలో ద్రవ్యలోటు కూడా బాగా పెరిగింది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికిగాను, జీడీపీలో ద్రవ్యలోటు 6.7 శాతంగా నమోదైంది. ఇది ‘కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ’ వేసిన అంచనాల కంటే తక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 6.9 శాతంగా నమోదవుతుందని కేంద్రం తొలుత అంచనా వేసింది. ఈ విషయాన్ని ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల్లో కూడా పొందుపరిచింది. తర్వాత ఈ అంచనాలను 6.9 శాతానికి మార్చింది.
Maggi Noodles: రోజూ మ్యాగీ చేసిపెట్టిన భార్య.. విడాకులిచ్చిన భర్త
అయితే, ఈ అంచనాలను కూడా తల్లకిందులు చేస్తూ జీడీపీలో ద్రవ్యలోటు 6.7 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలకు మించి పెరిగిన విషయం తెలిసిందే. బియ్యం, జొన్నలు, సజ్జలు, రాగి, గోధుమ, కూరగాయలు, పండ్ల ధరలు భారీగా పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణానికి దారి తీసినట్లు అధికారులు వెల్లడించారు.