Story of mother and son : తల్లి ఇష్టాన్ని నెరవేర్చిన కొడుకు.. ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న ఆయుష్ గోయల్ కథ..

కుటుంబం కోసం తల్లి పడ్డ కష్టాన్ని చూసాడు. ఆమ ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నాడు. అందుకోసం కొడుకుగా తన బాధ్యత నెరవేర్చాడు. అందరి మన్ననలు పొందాడు. ట్విట్టర్ యూజర్ ఆయుష్ గోయల్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు.

Story of mother and son : తల్లి ఇష్టాన్ని నెరవేర్చిన కొడుకు.. ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న ఆయుష్ గోయల్ కథ..

inspirational story

Updated On : June 1, 2023 / 5:52 PM IST

Inspirational Story : చిన్న ఉద్యోగం చేస్తూ తల్లి పడ్డ కష్టాలు ప్రత్యక్షంగా చూసాడు. ఓ భార్యగా, తల్లిగా పూర్తి సమయం ఉండటానికి ఇష్టపడే తన తల్లి ఇష్టాన్ని నెరవేర్చాడు. ఎంతో స్ఫూర్తిని కలిగించే కొడుకు కథ చదవండి.

Mamata Banerjee Workout: ట్రెడ్ మిల్‌పై కుక్కపిల్లతో మమతా బెనర్జీ వర్కౌట్లు.. అదనపు ప్రేరణ కావాలంటూ ట్వీట్..

ఆయుష్ గోయల్ Ayush Goyal అనే ట్విట్టర్ యూజర్ తన తల్లికి ఇష్టమైన పని చేసి నెటిజన్ల మన్ననలు పొందాడు. తన తల్లి గురించి అతను పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆయుష్ గోయల్ తల్లికి జాబ్ చేయడం ఇష్టం ఉండేది కాదు. కానీ ఇంట్లో కష్టాలు గుర్తొచ్చి పనిచేయాల్సి వచ్చేది.. అదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ. అంత కష్టపడి పనిచేస్తే ఆమెకు వచ్చే జీతం రూ.5,771. ఆమెకు వచ్చే జీతం ఆయుష్ కాలేజీ ఫీజుకి కూడా సరిపోయేది కాదు. ఆమెకు ఉద్యోగం చేయడం కన్నా భార్యగా, తల్లిగా ఉండటమనేది కల.

 

తల్లి ఇష్టాన్ని గమనించిన ఆయుష్ అకౌంటెంట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. కొందరి సాయంతో ఆన్ లైన్ రైటింగ్ పనులు మొదలు పెట్టాడు. తల్లి చేసే చిన్న ఉద్యోగాన్ని మాన్పించేసి ఆమె కల నెరవేర్చాడు. ఇప్పుడు ఆమె సంతోషంగా ఇంటిపనుల్లో బిజీగా ఉంది. ఈ విషయాన్ని ఆయుష్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ‘అమ్మ కల నెరవేరిందని.. తన 764 మంది స్నేహితులకు కు కృతజ్ఞతలు’ అంటూ తన తల్లి ఫోటోలను షేర్ చేశాడు.

Bengaluru : ఐపీఎల్ చూడటం టైమ్ వేస్ట్ అంటున్న బిజినెస్ మ్యాన్.. వెరైటీగా స్పందిస్తున్న నెటిజనులు

ఆయుష్ తన కష్టార్జితంతో తండ్రిని మొదటిసారి విమానం ఎక్కించాడు. తండ్రి సంతోషాన్ని గమనించాడు. ఇప్పుడు ఆయుష్ కుటుంబం చిన్న గది నుంచి డబుల్ బెడ్ రూం అపార్ట్మెంట్‌కి మారింది. తన కుటుంబం ఇష్టాల్ని నెరవేర్చడం కోసం కష్టపడుతున్న ఆయుష్‌ను నెటిజన్లు అభినందించారు. మరింతగా అభివృద్ధిలోకి వచ్చి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.