Komatireddy Raj Gopal Reddy: కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు.. సిద్ధంగా ఉండండి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కొన్ని నెలల్లో కర్ణాటకతో పాటు తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇవాళ నిర్మల్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలో ఉమ్మడి ఆదిలాబాద్‌లో 10 స్థానాల్లో బీజేపీని గెలిపించే బాధ్యత తనదేనని చెప్పుకొచ్చారు.

Komatireddy Raj Gopal Reddy: కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు.. సిద్ధంగా ఉండండి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy

Updated On : November 28, 2022 / 5:24 PM IST

Komatireddy Raj Gopal Reddy: కొన్ని నెలల్లో కర్ణాటకతో పాటు తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇవాళ నిర్మల్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలో ఉమ్మడి ఆదిలాబాద్‌లో 10 స్థానాల్లో బీజేపీని గెలిపించే బాధ్యత తనదేనని చెప్పుకొచ్చారు.

అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగంతోనే విజయం సాధించిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని, దీంతో సీఎం కేసీఆర్ భయపడుతున్నారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు లేదని అన్నారు.

Kim’s Daughter: మరోసారి తన కూతురితో కలిసి సైనికుల వద్దకు కిమ్.. ఏం సందేశం ఇస్తున్నారు?

కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలు లేరని చెప్పారు. కాబట్టి ఆ పార్టీ నుంచి తమ పార్టీలోకి నేతలు రావాలని రాజగోపాల్ రెడ్డి కోరారు. కాగా, మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో మునుగోడు స్థానం టీఆర్ఎస్ ఖాతాలో పడింది. వచ్చే నెల అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తానని, ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాల్సి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్తారని మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..