RRR: ఆర్ఆర్ఆర్ నుండి నేడు ‘నాటు’ సర్‌ప్రైజ్..!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్‌ను సొంతం చేసుకుంది. పలు కొత్త రికార్డులను ఈ సినిమా....

RRR: ఆర్ఆర్ఆర్ నుండి నేడు ‘నాటు’ సర్‌ప్రైజ్..!

Naatu Naatu Full Video Song From Rrr Releasing Today

Updated On : April 11, 2022 / 12:08 PM IST

RRR: స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్‌ను సొంతం చేసుకుంది. పలు కొత్త రికార్డులను ఈ సినిమా తన పేరిట నమోదు చేసుకోగా.. ఈ సినిమా జక్కన్న కెరీర్‌లో మరో మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోయింది. ఇక ఈ సినిమాకు ప్రాణంగా నిలిచారు ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాలోని తమ నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు ఈ హీరోలు. ఇక ‘ఆర్ఆర్ఆర్’లో వీరిద్దరు కలిసి చేసిన ఫైట్లు, డ్యాన్సులు, యాక్షన్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

RRR: జక్కన్న ఊహించిన దానికంటే తారక్ బెటర్ పర్ఫామెన్స్.. కామెంట్స్ వైరల్!

కాగా ఈ సినిమాలో ‘నాటు నాటు’ అనే ఊరమాస్ పాటలో ఈ ఇద్దరు హీరోలు కూడా పోటీపడి చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఏ ఒక్కరూ కూడా వెనక్కితగ్గకుండా చేసిన డ్యాన్స్ ఈ పాటను బ్లాక్‌బస్టర్ హిట్ చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి మేటి డ్యాన్సర్లు వేసిన స్టెప్పులు ఈ పాటకు మేజర్ హైలైట్‌గా నిలిచాయి. ఇక సినిమా రిలీజ్‌కు ముందే ఈ పాటను లిరికిల్ సాంగ్ రూపంలో రిలీజ్ చేయగా, దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా థియేటర్లలో ఈ పాటను చూసిన వారు కూడా తమ హీరోలతో కలిసి స్టెప్పులు వేయకుండా ఉండలేకపోయారు.

Naatu Naatu : రామ్ చరణ్, ఎన్టీఆర్ ‘నాటు నాటు’ స్టెప్పుకి ఇన్ని టేక్స్ తీసుకున్నారా??

అయితే తాజాగా ఆర్ఆర్ఆర చిత్ర యూనిట్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. నాటు నాటు పూర్తి వీడియో సాంగ్‌ను ఇవాళ సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. దీంతో మరోసారి యూట్యూబ్‌ను తారక్, చరణ్ అభిమానులు షేక్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ పాటలో ఇద్దరు కలిసి చేసిన డ్యాన్స్‌కు అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా పూర్తిగా లీనమైపోయారు. మరి నాటు నాటు పూర్తి వీడియో సాంగ్ యూట్యూబ్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.