Kaushik Reddy: రేవంత్ రూ.50కోట్లిచ్చి అధ్యక్షుడయ్యారు

హుజూరాబాద్‌కు ఉపఎన్నిక రాబోతున్నవేళ ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 2018ఎన్నికల్లో పోటీచేసిన కౌశిక్ రెడ్డి రాజీనామా చెయ్యగా రాజకీయం రసవత్తరంగా మారింది.

Kaushik Reddy: రేవంత్ రూ.50కోట్లిచ్చి అధ్యక్షుడయ్యారు

Kaushik

Updated On : July 12, 2021 / 7:03 PM IST

Huzurabad Bypoll: హుజూరాబాద్‌కు ఉపఎన్నిక రాబోతున్నవేళ ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 2018ఎన్నికల్లో పోటీచేసిన కౌశిక్ రెడ్డి రాజీనామా చెయ్యగా రాజకీయం రసవత్తరంగా మారింది. తనకు టీఆర్ఎస్ టిక్కెట్ రాబోతున్నట్లుగా ఓ యువకుడితో కౌశిక్ రెడ్డి చెబుతున్న ఆడియో బయటకు రాగా.. ఆయన గులాబీ పార్టీలోకి వెళ్లటం ఖరారైంది.

ఆడియో విడుదలయ్యాక 24గంటల్లో సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ ఆదేశించగా.. తానే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కౌశిక్ రెడ్డి. ఈ సంధర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి.

మాణిక్కం ఠాగూర్‌‌కు రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా అయ్యారంటూ ఆరోపించారు. మాణిక్కం ఠాగూర్ ఓ యూజ్‌లెస్ ఫెలో అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

చాలాబాధతో రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పిన కౌశిక్ రెడ్డి.. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్న వారిలో నేను మొదటివాడిని. కానీ, హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ గెలవదన్న రేవంత్‌ వ్యాఖ్యలు బాధ కలిగించాయని అన్నారు.

రేవంత్ రెడ్డికి మేం పిచ్చోళ్లలా కనిపిస్తున్నామా? అంటూ ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ భ్రమల్లో ఉన్నారని, అమ్ముడు పోయింది నేను కాదు.. రేవంత్‌రెడ్డేనని, ఈటల రాజేందర్‌కు రేవంత్ రెడ్డి అమ్ముడు పోయారంటూ విమర్శించారు.