Uma Bharathi : మా చెప్పులు మోయడానికే అధికారులు పనికొస్తారు: ఉమాభారతి

ప్రభుత్వ అధికారులు మా చెప్పులు మోయటానికే పనికొస్తారంటూ వ్యాఖ్యానించి మరోసారి వార్తల్లో నిలిచారు బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి.

Uma Bharathi : మా చెప్పులు మోయడానికే అధికారులు పనికొస్తారు: ఉమాభారతి

Uma Bharathi Commentes

Updated On : September 21, 2021 / 4:01 PM IST

BJP fire brand uma bharathi Controversial comments : బీజేపీ ఫైర్..మాజీ కేంద్రమంత్రి..మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. ప్రభుత్వ  అధికారులను చులకన చేసి మాట్లాడారు.  అధికారులు మా చెప్పులు మోయటానికే పనికొస్తారంటూ వ్యాఖ్యానించి మరోసారి వార్తల్లో నిలిచారు ఉమాభారతి.సెప్టెంబర్ 18న భోపాల్ లో ఓబీసీ మహాసభ ప్రతినిధులతో మాట్లాడుతున్న సందర్భంగా..నాయకులు అధికారులు చెప్పినట్లు నడుచుకుంటున్నారా…అనే ప్రశ్నకు సమాధానంగా ఉమాభారతి ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more : Muslim Sculptors : ముస్లిం శిల్పులపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
‘‘ప్రభుత్వ అధికారులకు పోస్టింగ్ లు ఇచ్చేదీ మేమే..వాళ్లకు జీతాలు ఇచ్చేది కూడా మేమే…వాళ్లకు ప్రమోషన్ లు, డిమోషన్ లు కూడా మా చేతుల్లోనే ఉంటాయి…వాళ్ళు కేవలం మా చెప్పులు మోయడానికి పనికి వస్తారు. రాజకీయాల కు మేమే వాళ్ళను వాడుకుంటాం’’అని ఉమాభారతి బహిరంగంగానే వ్యాఖ్యానించటం గమనించాల్సిన విషయం. ఉమాభారతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతలు పలు విమర్శలు చేస్తున్నారు.
ఉమాభారతి వ్యాఖ్యలపై బీజేపీ మద్దతునిస్తోందా? అని కాంగ్రెస్ అధికార ప్రతినిధు నరేంద్ర సాలుజాతో సహా పలువురు నేతలు ప్రశ్నించారు.

Read more: గాడ్సే వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ 

కాగా..రాజకీయనాయకులు అధికారులను చులకనగా చూడటం కొత్తేమీ కాదు. ముఖ్యంగా బీజేపీ నేతలు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో ముందుంటారనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందులోని బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన ఉమాభారతి వ్యాఖ్యలు గురిచి తెలిసిందే.