Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

గత కొద్దిరోజులుగా పడుతూలేస్తూ ఉన్న బంగారం ధర శుక్రవారం రూ.441 మేర పెరిగగా సోమవారం అదేస్థాయిలో తగ్గింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో నేడు బంగారం రూ.464లు తగ్గడంతో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.47,705కి చేరింది.

Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Reduced Gold And Silver Prices

Updated On : June 14, 2021 / 8:53 PM IST

Gold Rate: గత కొద్దిరోజులుగా పడుతూలేస్తూ ఉన్న బంగారం ధర శుక్రవారం రూ.441 మేర పెరిగగా సోమవారం అదేస్థాయిలో తగ్గింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో నేడు బంగారం రూ.464లు తగ్గడంతో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.47,705కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.48,169గా ఉంది.

బంగారం ధర బాటలనే వెండి కూడా పయనించింది. వెండి ఫ్యూచర్స్ ధర రూ.790 పతనమై కేజీకి రూ.71,440కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోవడంతో దేశీ మార్కెట్‌లోనూ అదే ట్రెండ్ కొనసాగిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా డాలర్ బలపడటంతో పసిడి రేటుపై ప్రతికూల ప్రభావం పడిందని చెబుతున్నారు.

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చి ఔన్స్‌కు బంగారం ధర 1.26 పతనమైంది. దీంతో బంగారం ధర 1855 డాలర్లకు పడిపోగా బంగారం ధర బాటలోనే వెండి కూడా పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 1.4 శాతం క్షీణించగా రేటు 27.76 డాలర్లకు తగ్గింది. పసిడి రేటు వెలవెలబోవడం బంగారం కొనాలని భావించే వారికి శుభవార్తే కాగా వెండి కూడా అదే బాటలో పయనించడం మరింత ఊరట కలిగించే అంశం.