Telangana Lock Down: సీజ్ చేసిన వాహనాలను తీసుకెళ్లొచ్చు!

Telangana Lock Down: సీజ్ చేసిన వాహనాలను తీసుకెళ్లొచ్చు!

Telangana Lock Down (1)

Updated On : June 22, 2021 / 7:00 AM IST

Telangana Lock Down: కరోనా కట్టడిలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించినా కొందరు పెడచెవిన పెట్టి రోడ్ల మీదకి వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి వారికి పోలీసులు తగిన రీతిలో బుద్ది చెప్పారు. లాక్ డౌన్ సమయంలో రోడ్ల మీదకి వచ్చిన వాహనాలను సీజ్ చేసిన పోలీసులు జరిమానాలు విధించారు. కాగా.. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో సీజ్ చేసిన వాహనాలను జరిమానాలు చెల్లించి తీసుకెళ్లాలని రాష్ట్ర పోలీసు శాఖ స్పష్టం చేసింది.

ఈ మేరకు జిల్లా ఎస్పీ, కమిషనరేట్లకు డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. జరిమానాలు ఈపెట్టీ, ఈ-చలానా ద్వారా చెల్లించి వాహనాలను తీసుకెళ్లవచ్చని చెప్పారు. కాగా.. అందులో తీవ్రమైన కేసులను మాత్రం పోలీసులు కోర్టుకి పంపితే.. వాహనదారులకు కోర్టులోనే జరిమానా విధించడం లేదా ప్రొసీడింగ్స్ ప్రకారం జైలు శిక్ష ఖరారు చేసే అవకాశం ఉండనుంది.