T20 World Cup-2022: టీమిండియా అభిమానులకు శుభవార్త.. గాయం నుంచి కోలుకుని మళ్ళీ నెట్స్‌లో రోహిత్ శర్మ

టీమిండియా అభిమానులకు శుభవార్త. ప్రాక్టీసు సెషన్ లో గాయపడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మళ్ళీ నెట్స్ లో ప్రాక్టీసు చేస్తూ కనపడ్డాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఎల్లుండి ఇంగ్లండ్ తో టీమిండియా తలపడనుంది.

T20 World Cup-2022: టీమిండియా అభిమానులకు శుభవార్త.. గాయం నుంచి కోలుకుని మళ్ళీ నెట్స్‌లో రోహిత్ శర్మ

Rohit Sharma

Updated On : November 8, 2022 / 3:34 PM IST

T20 World Cup-2022: టీమిండియా అభిమానులకు శుభవార్త. ప్రాక్టీసు సెషన్ లో గాయపడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మళ్ళీ నెట్స్ లో ప్రాక్టీసు చేస్తూ కనపడ్డాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఎల్లుండి ఇంగ్లండ్ తో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ప్రాక్టీస్ సెషన్ లో టీమిండియా ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మకు ముంజేయికి స్వల్ప గాయమైంది. దీంతో అతడు టోర్నీకి దూరమవుతాడా? అన్న సందేహాలు నెలకొన్నాయి.

అయితే, చికిత్స తీసుకుని కొద్ది సేపటికే రోహిత్ శర్మ మళ్ళీ ప్రాక్టీసు సెషన్ లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా ఈ నెల 10న అడిలైడ్ ఓవల్ మైదానంలో సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే అడిలైడ్ ఓవల్ కు భారత జట్టు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీసు మొదలు పెట్టింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..