ఒకే రోజులో 50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు

కరోనా సమయంలోనూ రైతులకు అండగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం. రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లోకి మళ్లీంచింది కేసీఆర్ సర్కారు. రికార్డు స్థాయిలో ఒకే రోజులో 50.84 లక్షల మంది ఖాతాల్లోకి రూ.5294.53 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ప్రతి గంటకు లక్ష మంది రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులను జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
రైతు బంధుకు సంబంధించి ప్రతి పంటకు ఎకరానికి రూ.5 వేలు చొప్పున పెట్టుబడి సాయంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాస్ బుక్ లు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ రైతు బంధు వర్తింపు చేసింది. బ్యాంకు వివరాలు ఇవ్వని 5 లక్షల మంది రైతులు ఉన్నారు. ఏఈవోలకు వివరాలు అందగానే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
వానాకాలపు సీజన్ కు సంబంధించి పెట్టుబడి సాయంగా దాదాపు 50 లక్షల మంది రైతులకు రైతుబంధు నిధులను వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులను జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏజెన్సీ పట్టాదారులకు చెందిన 63, 477 మంది రైతులకు రూ.82.37 కోట్లు రైతుబంధు నిధులను విడుదల చేసింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డు సమయంలో డబ్బులు జమ చేసింది.