Telangana Rains Forecast : తెలంగాణలో ఆగస్టు14 వరకు వర్షాలు

తెలంగాణలో గత కొద్ది రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంగలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో మరో ఐదు రోజులు వర్షాలు కురువనున్నాయి. ఈనెల 14వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Telangana Rains Forecast : తెలంగాణలో ఆగస్టు14 వరకు వర్షాలు

Telangana Rains Forecast

Updated On : August 10, 2022 / 11:24 PM IST

Telangana Rains Forecast : తెలంగాణలో గత కొద్ది రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంగలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో మరో ఐదు రోజులు వర్షాలు కురువనున్నాయి. ఈనెల 14వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఒడిశా తీర ప్రాంతంలో ఉన్న వాయుగుండం బలహీనపడింది. ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదిలి.. రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలావుంటే ఈ నెల 13వ తేదీన వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

AP Heavy Rains Cyclone : వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం..భారీ వర్షాలు పడే అవకాశం

ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి.. ఆ తర్వాత 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో 14న మంచిర్యాల, జయశంకర్‌ భూపాల్‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.