T20 World Cup Semi Final: సెమీ ఫైనల్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇరుజట్లు ఎన్నిసార్లు తలపడ్డాయంటే?
టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లండ్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. ఇంగ్లండ్‌పై టీమిండియాదే పైచేయిగా ఉంది. మూడు మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌పై భారత్ రెండుసార్లు విజయం సాధించగా, ఇంగ్లండ్ ఒక్కసారి విజయం సాధించింది.

T20 World Cup Semi Final
T20 World Cup Semi Final: టీ20 ప్రపంచకప్ టోర్నీలో సెమీఫైనల్‌కు నాలుగు జట్లు చేరుకున్నాయి. గ్రూప్-1 నుంచి న్యూజీలాండ్, ఇంగ్లాండ్, గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధించాయి. ఈనెల 9న న్యూజీలాండ్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుండగా, 10న ఆడిలైడ్ ఓవల్‌లో ఇంగ్లాండ్ జట్టును టీమిండియా ఢీకొట్టనుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు ఇంతకు ముందుకూడా ఇంగ్లండ్‌తో తలపడింది.

T20 World Cup-2022 Semi Final Match
టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లండ్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. ఇంగ్లండ్‌పై టీమిండియాదే పైచేయిగా ఉంది.

T20 World Cup-2022 Semi Final Match
మూడు మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌పై భారత్ రెండుసార్లు విజయం సాధించగా, ఇంగ్లండ్ ఒక్కసారి విజయం సాధించింది.

T20 World Cup-2022 Semi Final Match
2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్‌లో 6 సిక్సర్లు బాదాడు. చిరస్మరణీయమైన, చారిత్రాత్మకమైన ఈ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.

T20 World Cup-2022 Semi Final Match
2009లో టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్-భారత్ మధ్య రెండోసారి మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది ఈ మ్యాచ్‌లో భారత జట్టు మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది.

T20 World Cup-2022 Semi Final Match
2012లో ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య మూడోసారి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 90 పరుగుల తేడాతో టీమిండియాపై భారీ విజయం సాధించింది.

T20 World Cup-2022 Semi Final Match
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్‌లో తలపడడం ఇదే తొలిసారి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక్కసారికూడా ఇరు జట్ల మధ్య నాకౌట్ మ్యాచ్ జరగలేదు.

T20 World Cup Semi Final
భారత్, ఇంగ్లండ్ జట్లు టీ20 ప్రపంచ కప్‌తో కలిపి మొత్తం 22 టీ20 మ్యాచ్‌లు ఆడాయి. వీటిల్లో 12 విజయాలతో భారత్‌దే పైచేయిగా ఉంది.