Top Headlines: పల్లవి ప్రశాంత్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. డబ్ల్యూఎఫ్ఐ కొత్త చీఫ్‌గా సంజయ్ సింగ్..
బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. పోలీసుల విధులకు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఆటంకం కలిగించాడని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

HEADLINE
డబ్ల్యూఎఫ్ఐ కొత్త చీఫ్‌గా సంజయ్ కుమార్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త చీఫ్‌గా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. పోటీ చేసిన ఎనిమిది మందిలో సంజయ్ సింగ్‌కు అత్యధిక ఓట్లు రావడంతో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సంజయ్ సింగ్ ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. పోలీసుల విధులకు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఆటంకం కలిగించాడని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ప్రశాంత్ కారణంగానే యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. పల్లవి ప్రశాంత్ అతడి అనుచరులను రెచ్చగొట్టడంతో వాహనాలు ధ్వంసం చేశారని పోలీసులు చెబుతున్నారు.
తీర్పు వాయిదా
బిగ్‌బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ పూర్తి అయ్యింది. ధర్మాసనం తీర్పును రేపటికి వాయిదా వేసింది. ప్రశాంత్ తరుపు న్యాయవాది జులకంటి వేణుగోపాల్ తన క్లైంట్ ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టును కోరారు. పోలీసులు సరైన భద్రత లేకపోవడం వలనే ఇలాంటి పరిణామాలు జరిగాయని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న కోర్టు తీర్పును రేపటికి వాయిదావేసింది.
అసెంబ్లీలో ఎంఐఎం Vs కాంగ్రెస్
అసెంబ్లీలో ఎంఐఎం కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అక్బరుద్దీన్, సీఎం రేవంత్ మధ్య మాటల యుద్ధం వాడీవేడిగా జరిగింది. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న సీఎం రేవంత్ ముస్లిం అభ్యర్ధుల్ని ఓడించేందుకు బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేశాయని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని తప్పు పట్టారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ. కాంగ్రెస్ లో ముస్లిం అభ్యర్ధుల ఓటమికి ఎంఐఎం కారణం ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ అన్ని అవాస్తవాలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
కస్టడి పొడిగింపు..
పార్లమెంట్ ఘటనలో నిందితుల కస్టడిని కోర్టు పొడిగించింది. నిందితులకు మరో 15రోజులపాటు పొడిగించింది.
కోర్టు స్టేటస్ కో..
విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోటర్టు స్టేటస్ కో విధించింది. ఈకేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసేవరకు స్టేటస్ కో అమలులో ఉంటుందని హైకోర్టు వెల్లడించింది.
పవర్ వార్..విచారణకు సిద్ధం..
విద్యుత్ రంగంపై న్యాయ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ తెలిపారు. మూడు అంశాలపై ఎంక్వైరీ జరిపిస్తామన్న సీఎం రేవంత్.. చత్తీష్ గడ్ ఒప్పదం, భద్రాద్రి, యాదద్రి పవర్ ప్రాజెక్టు పై జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేస్తామని చెప్పారు. 24 గంటల కరెంట్ పై అఖిలపక్షంతో నిజనిర్ధారణ కమిటీ వేస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్ ఘడ్ తో టెండర్లు లేకుండా ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్ ఘడ్ తో టెండర్లు లేకుండా ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. ఛత్తీస్ ఘడ్ ఒప్పందంపై ఆనాడే తాము పోరాటం చేస్తే మార్షల్స్ తో తమను సభ నుంచి బయటకు పంపారని గుర్తు చేశారు.
సవాళ్ల పర్వం
తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చ వాడీ వేడిగా జరుగుతోంది.విద్యుత్ రంగం గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. దీంతో రిటైర్డ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీంతో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
సింగరేణి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. అనంతరం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో డిసెంబర్ 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు జరుగనున్నాయి.
సభా సమరం
తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చ ప్రారంభమైంది. ఆరో రోజు అసెంబ్లీ కార్యక్రమాల్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ రంగంపై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. నిన్న పదేళ్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై జరిగిన చర్చలో భాగంగా విమర్శలు, ప్రతివిమర్శలతో సభ దద్దరిల్లింది. నేడు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా విపక్షం బీఆర్ఎస్ నుంచి ఎటువంటి విమర్శలు, సమాధానాలు వస్తాయో వేచి చూడాలి.
మరో ఇద్దరు అరెస్ట్
పార్లమెంటు భద్రత వైఫల్య ఘటనలో మరో ఇద్దరు అరెస్ట్ చేశారు. మనోరంజన్ సహచరుడు కర్ణాటకకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సాయికృష్ణను పొలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన అతుల్ అనే మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో మనోరజన్ కు సాయికృష్ణ రూమ్ మేట్ గా ఉండేవాడని తెలుస్తోంది. దీంతో కర్ణాటకలోని బాగల్ కోట్ కు చెందిన సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జైల్లో బిగ్‌బాస్ విజేత
బిగ్‌బాస్7 విజేత పల్లవి ప్రశాంత్‌కు రిమాండ్ విధించారు. పల్లవి ప్రశాంత్‌కు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ధ్వంసం కేసులో రిమాండ్ విధించారు. దీంతో పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడ్ని చంచల్ గూడ జైలుకు తరలించారు. పల్లవి ప్రశాంత్‌ని నిన్న రాత్రి గజ్వేల్ లో అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు పీఎస్‌కు తరలించి ఆరుగంటల పాటు విచారించారు. అనంతర జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్‌తో పాటు ఆయన సోదరుడిని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ,ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో అరెస్ట్ చేసినట్లుగా న్యాయమూర్తికి వివరించారు. దీంతో న్యాయమూర్తి ప్రశాంత్ కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని సోదరుని చంచల్ గూడా జైలుకు తరలించారు.
మావోల వీరంగం
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు వీరంగం సృష్టించారు. చింతూరు మండలం వీరాపురంలో పలు వాహనాలకు నిప్పుపెట్టారు. రేపు బంద్ కు పిలుపునిచ్చారు.
సోనియా, ఖర్గేలకు ఆహ్వానం..
అయోధ్య లో రామమందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియాగాంధీలకు ఆహ్వానం అందింది. లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌందరికి ఆహ్వానం వచ్చింది. శ్రీరాం జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఈ ఆహ్వానాలను వారికి పంపింది.
అతిపెద్ద నౌక..
ప్రపంచంలోనే అతిపెద్ద విలాసవంతమైన నౌక సముద్రంలో ప్రయాణం మొదలు పెట్టింది. చైనా దీనిని తయారు చేసింది. ఈ ఓడ టైటానిక్ తరహా నౌకగా పేరుగాంచింది. ఒకే విడతలో 2500 మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంది.
అమెరికాలో తెలుగు యువతి మృతి ..
ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువతి మృతిచెందింది. విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ (22) స్థానికంగా ఫిజియోథెరఫీలో డిగ్రీ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లారు. బుధవారం షికాగో నగరంలో ఆమె ప్రయాణిస్తున్న కారులో గ్యాస్ లీక్ అయింది. దీంతో డ్రైవర్ తో పాటు నాజ్ కూడా స్పృహతప్పారు. జహీరా నాజ్ ను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.